ముగిసిన పోసాని విచారణ..లవ్ యూ రాజా అంటూ సమాధానాలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణ ముగిసింది.;

Advertisement
Update:2025-02-27 21:48 IST

సినీ నటుడు పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణ ముగిసింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌‌లో పోసాని 9 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను విచారించారు. విచారణ అనంతరం పోసానిని రైల్వేకోడూరు కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోసాని మాట్లాడిన వీడియోలు చూపించి అడిగిన ప్రశ్నలకు లవ్ యూ రాజా అంటూ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.అయితే గుర్తులేదు, తెలియదు, అవునా అంటూ పోసాని చెప్పిన సమాధానాలను పోలీసులు రికార్డు చేశారు. విచారణ అనంతరం పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులకు వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసానిని అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఉదయం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News