హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మ్యాన్ మృతి

హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మ్యాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Advertisement
Update:2025-02-27 15:23 IST

హాలీవుడ్ నటుడు రెండు సార్లు ఆస్కార్ అవార్డు విజేత జీన్ హ్యాక్‌మ్యాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. న్యూమెక్సికోలోని ఇంట్లో జీన్, ఆయన సతీమణి, పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారి మృతిపై అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి అనుమానాస్పద సంకేతాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. హాక్‌మన్ వయసు 95 ఏళ్లు కాగా ఆయన భార్య వయసు 63. జీన్ హాక్‌మన్, అతని భార్య ఇద్దరూ బుధవారం మధ్యాహ్నం సన్‌సెట్ ట్రైల్‌లోని వారి నివాసంలో చనిపోయారని నిర్ధారించామని పోలీసులు చెబుతున్నారు.1930లో జన్మించిన మిస్టర్ హాక్‌మన్ 100కి పైగా పాత్రలు పోషించారు. ఆయన నటనకు గానూ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు. - ఫ్రెంచ్ కనెక్షన్‌లో జిమ్మీ "పొపాయ్" డోయల్ పాత్రకు బెస్ట్ యాక్టర్‌గా.. అన్‌ఫర్గివెన్‌లో లిటిల్ బిల్ డాగెట్ పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా ఈయన ఆస్కార్ ఆవార్డు అందుకున్నారు.  

Tags:    
Advertisement

Similar News