ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద బీఆర్‌ఎస్ నేతల ధర్నా

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు దిగారు

Advertisement
Update:2025-02-27 15:00 IST

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోపలికి నలుగురికి మాత్రమే అనుమతి ఉందని చెబుతున్నారు. దీంతో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నేతలు రోడ్డుపైనే కూర్చొని ఆందోళన చేస్తున్నారు నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. అయితే సొరంగంలోకి వెళ్ల‌నీయ‌కుండా హ‌రీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హ‌రీశ్‌రావు, ఇత‌ర నాయ‌కులు రోడ్డుపైనే బైఠాయించిన నిర‌స‌న తెలిపారు.

పోలీసుల తీరుపై హ‌రీశ్‌రావు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.ఎస్ఎల్‌బీసీ ప్ర‌మాద ఘ‌ట‌న‌ను ప‌రిశీలించేందుకు మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ నేత‌లు హైద‌రాబాద్ నుంచి ఇవాళ ఉద‌యం బ‌య‌ల్దేరిన సంగ‌తి తెలిసిందే. క‌ల్వ‌కుర్తిలో బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి హ‌రీశ్‌రావు టీ తాగారు. అనంత‌రం అక్క‌డ్నుంచి నేరుగా ఎస్ఎల్బీసీ సొరంగం వ‌ద్ద‌కు చేరుకున్న‌ప్ప‌టికీ.. లోప‌లికి పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. భారీగా పోలీసులు మోహ‌రించారు. మీడియాపై కూడా పోలీసులు ఆంక్ష‌లు విధించారు.

Tags:    
Advertisement

Similar News