సీఎం చంద్రబాబును కలిసిన ఐఓఏ చీఫ్ పీటీ ఉష

సీఎం చంద్రబాబును ఐఓఏ చీఫ్ పీటీ ఉష కలిశారు;

Advertisement
Update:2025-02-27 21:21 IST

ఏపీ సీఎం చంద్రబాబును భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కలిశారు. ఉండవల్లిలోని తన నివాసంలో కలిసిన పీటీ ఉషతో నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని తీసుకొచ్చే విషయంలో ఆమె మద్దతు కోరినట్లు తెలిపారు.

అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేసే ప్రణాళికలపైనా చర్చించినట్లు తెలిపారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు అత్యుత్తమ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.ఏపీలో 2029లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఐఓఏ చీఫ్ పీటీ ఉష కోరినట్టు సీఎం తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News