టీడీపీకి బిగ్ షాక్.... హైకోర్టుకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల

మంగళగిరిలో విలువైన భూమిని కబ్జా చేసి అక్రమంగా రూ.99కే లీజుకు తీసుకొని టీడీపీ ఏపీ రాష్ట్ర ఆఫీసును కట్టారని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఈ భూ కేటాయింపు జరగగా.. ఇటీవలే సర్వాంగ సుందరంగా టీడీపీ ఆఫీసును కట్టారు. అయితే అక్రమంగా ప్రభుత్వ భూమిలో కట్టారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏకంగా ఇప్పుడు టీడీపీకి భారీ షాకిచ్చారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా మంగళగిరిలో కట్టిన టీడీపీ […]

Advertisement
Update:2019-12-16 08:36 IST

మంగళగిరిలో విలువైన భూమిని కబ్జా చేసి అక్రమంగా రూ.99కే లీజుకు తీసుకొని టీడీపీ ఏపీ రాష్ట్ర ఆఫీసును కట్టారని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు హయాంలో ఈ భూ కేటాయింపు జరగగా.. ఇటీవలే సర్వాంగ సుందరంగా టీడీపీ ఆఫీసును కట్టారు. అయితే అక్రమంగా ప్రభుత్వ భూమిలో కట్టారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏకంగా ఇప్పుడు టీడీపీకి భారీ షాకిచ్చారు.

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా మంగళగిరిలో కట్టిన టీడీపీ ఆఫీసు అక్రమమంటూ హైకోర్టులో సోమవారం పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని ఆయన పిటీషన్ లో ఆరోపించారు. ఈ పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు… విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

ఇప్పటికే చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమమని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక టీడీపీ ఆఫీసును కూడా ఆ కోవలోకే చేర్చింది. ఆళ్ల పిటీషన్ తో రాష్ట్ర ప్రభుత్వానికి, గుంటూరు జిల్లా కలెక్టర్ కు , టీడీపీకి హైకోర్టు నోటీసులు పంపింది.

ఇక టీడీపీ ఆఫీసు అక్రమమని రుజువు చేసే ఆధారాలను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల హైకోర్టుకు సమర్పించినట్టు సమాచారం. దీంతో విచారణలో ఇవి కీలకంగా ఉన్నాయట.. ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ విచారణతో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    
Advertisement

Similar News