విడతల వారీగా అభివృద్ధి పనులు... రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం....
ఏపీలో వైసీపీ సర్కారు గద్దెనెక్కాక రాజధాని అమరావతిని మార్చేస్తుందంటూ టీడీపీ, దాని అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. దాంతోపాటు మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ మీడియా బాగా హైలైట్ చేసింది. అయితే ఈ దుమారం ప్రజల్లో నానిన వేళ ఏపీ సీఎం జగన్ మాత్రం దీనిపై స్పందించలేదు. రాజధాని అమరావతిని కొనసాగిస్తారా లేదా వేరే ప్రాంతానికి మారుస్తారా? అన్న విషయంలో సందిగ్దత కొనసాగుతున్న వేళ… ఏపీ సీఎం జగన్ రాజధానిపై ప్రజల్లో ఆందోళనకు, […]
ఏపీలో వైసీపీ సర్కారు గద్దెనెక్కాక రాజధాని అమరావతిని మార్చేస్తుందంటూ టీడీపీ, దాని అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. దాంతోపాటు మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ మీడియా బాగా హైలైట్ చేసింది.
అయితే ఈ దుమారం ప్రజల్లో నానిన వేళ ఏపీ సీఎం జగన్ మాత్రం దీనిపై స్పందించలేదు. రాజధాని అమరావతిని కొనసాగిస్తారా లేదా వేరే ప్రాంతానికి మారుస్తారా? అన్న విషయంలో సందిగ్దత కొనసాగుతున్న వేళ… ఏపీ సీఎం జగన్ రాజధానిపై ప్రజల్లో ఆందోళనకు, అనుమానాలకు తెరదించాడు.
తాజాగా అమరావతి రాజధానిపై జగన్ భారీ ముందడుగు వేశారు. అమరావతిని విడతల వారీగా అభివృద్ధి చేస్తామని.. నిధుల లభ్యత, ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు.
ఈ మేరకు ఐఐటీ నిపుణులను అమరావతికి రప్పిస్తోంది ఏపీ సర్కారు. రాజధానిలో రోడ్లు, మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని జగన్ నిర్ణయించారు.
వారి సూచనలకు అనుగుణంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి… రాజధానికి ఓ రూపు తేవడానికి జగన్ సర్కారు ప్లాన్ చేసింది.