13 జిల్లాలు.. 13 టేబుళ్లు.... ఏపీ సీఎం విందు
ఏపీలో పాలనపై మరింత దృష్టి పెట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నుంచి కొంత గ్యాప్ రావడంతో ఆయన జిల్లాల వారీగా సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకుపోయేందుకు ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకోబోతున్నారు…. అంతేకాదు 13 జిల్లాల్లో ఉన్న సమస్యలేంటి? వాటికి తీసుకోవాల్సిన చర్యలేంటి? అనే వాటిపై కూడా సీఎం ఫోకస్ పెట్టబోతున్నారు. ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలకు సీఎం […]
ఏపీలో పాలనపై మరింత దృష్టి పెట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల నుంచి కొంత గ్యాప్ రావడంతో ఆయన జిల్లాల వారీగా సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకుపోయేందుకు ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకోబోతున్నారు…. అంతేకాదు 13 జిల్లాల్లో ఉన్న సమస్యలేంటి? వాటికి తీసుకోవాల్సిన చర్యలేంటి? అనే వాటిపై కూడా సీఎం ఫోకస్ పెట్టబోతున్నారు.
ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి విందు ఇవ్వనున్నారు. మంగళవారం రాత్రి ఈ డిన్నర్ పార్టీ ఆరెంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విందులో జిల్లా అధికారులతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గోనున్నారు.
జిల్లాకు ఒక టేబుల్ చొప్పున 13 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ దగ్గర ఆ జిల్లాల గురించి 10 నిమిషాల పాటు ఆ జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించనున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారాలు చూపించనున్నారు.
అయితే జగన్ ఇచ్చే విందుపై కొంత ఆసక్తి నెలకొంది. ఆయన ఈ మీటింగ్‌లో ఏం చర్చిస్తారు? ఎలాంటి ఎజెండా ముందు పెట్టబోతున్నారు? అనే దానిపై చర్చ నడుస్తోంది. ఇంతకుముందు మీటింగ్ అంటే రోటీన్‌గా జరిగేవి. అయితే ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా సమస్యలను ప్రస్తావించి…అక్కడే పరిష్కారం చూపడమే ఇక్కడ ప్రధాన టార్గెట్.
దీంతో పాటు జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం చాలా అవసరం. అందుకోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యేలతో ఇంతవరకూ జగన్ పూర్తిస్థాయిలో ఇంటరాక్ట్ అవలేదు. దీంతో ఒకేసారి అధికారులు, వైసీపీ ఎమ్మెల్యేలను కలిసినట్లు ఉంటుందని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని అంటున్నారు. మొత్తానికి జగన్ విందుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.