చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు పొడిగింపు లేదు

అధికారికంగా ప్రకటించిన సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ గా గత నాలుగు సంవత్సరాలుగా సేవలు అందించిన ఆంధ్ర మాజీ కెప్టెన్ ఎమ్మెస్కే ప్రసాద్ నాలుగేళ్ల ప్రస్థానం ముగిసింది. కేవలం అతికొద్ది అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవంతోనే సెలెక్షన్ కమిటీ బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. హర్భజన్ సింగ్, ఫరూక్ ఇంజనీర్ లాంటి ప్రముఖుల నుంచి తీవ్రవిమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. 2015 సీజన్ నుంచి భారత క్రికెట్ బోర్డు సీనియర్ సెలెక్షన్ కమిటీ […]

Advertisement
Update:2019-12-02 13:52 IST
  • అధికారికంగా ప్రకటించిన సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ గా గత నాలుగు సంవత్సరాలుగా సేవలు అందించిన ఆంధ్ర మాజీ కెప్టెన్ ఎమ్మెస్కే ప్రసాద్ నాలుగేళ్ల ప్రస్థానం ముగిసింది.

కేవలం అతికొద్ది అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవంతోనే సెలెక్షన్ కమిటీ బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. హర్భజన్ సింగ్, ఫరూక్ ఇంజనీర్ లాంటి ప్రముఖుల నుంచి తీవ్రవిమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది.

2015 సీజన్ నుంచి భారత క్రికెట్ బోర్డు సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యులుగా ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీ, శరణ్ దీప్ సింగ్, జతిన్ పరంజపే ఏడాదికి 60 లక్షల రూపాయల నుంచి 80 లక్షల రూపాయల వరకూ వేతనం అందుకొంటూ బాధ్యతలు నిర్వర్తించారు.

సెలెక్టర్లకూ బోనస్…

ఆస్ట్రేలియా ను ఆస్ట్రేలియాగడ్డపై ఓడించి…భారత జట్టు తొలిసారిగా టెస్ట్ సిరీస్, ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించడంలో సెలెక్షన్ కమిటీ పాత్ర సైతం ఎందో ఉందంటూ …ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలో…గగన్ ఖోడా, శరణ్ దీప్ సింగ్, జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీలకు..బోనస్ గా బీసీసీఐ తలో 20 లక్షల రూపాయలు చెల్లించింది.

చీఫ్ సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ ఏడాదికి 80 లక్షల రూపాయలు వేతనంగా అందుకొంటే….మిగిలిన సెలెక్టర్లు 60 లక్షల రూపాయలు చొప్పున వేతనం పొందుతూ వచ్చారు.

ఎమ్మెస్కేకు పొడిగింపు లేదు..

బీసీసీఐ ఎంపికసంఘం చైర్మన్ గా గత నాలుగేళ్ల కాలంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లుగా ఆడుతూ వచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్ కు మరో ఏడాదిపాటు పొడిగింపు ఇచ్చేది లేదని…నిబంధనల ప్రకారం పదవీకాలం ముగిసిందని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పారు.

ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అంబటి రాయుడు, సంజు శాంసన్ లాంటి ప్రతిభావంతులైన పలువురు క్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పించలేదని… అర్థంపర్థం లేని కారణాలతో తొక్కేసిందంటూ విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సైతం..రాయుడికి జరిగిన అన్యాయాన్ని నిలదీశాడు. చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ను తప్పుపట్టాడు.

2015 లో సెలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెస్కే, గగన్ ఖోడాల పదవీ కాలం ముగిస్తే..2016లో నియమితులైన శరణ్ దీప్ సింగ్, జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీ మాత్రం మరో ఏడాది పాటూ విధుల్లో కొనసాగున్నారు.

బీసీసీఐ పాత నిబంధనల ప్రకారం..సెలెక్షన్ కమిటీ సభ్యులు ఇక నుంచి ఐదు సంవత్సరాల కాంట్రాక్టుపై కొనసాగనున్నారు.

Tags:    
Advertisement

Similar News