ఆర్టీసీ కార్మికుల‌పై కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

ఆర్టీసీ స‌మ్మె ముగిసిన త‌ర్వాత కార్మికుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వారితో క‌లిసి భోజ‌నం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం వారి ద‌గ్గ‌ర నుంచి సూచ‌న‌లు తీసుకున్నారు. ఆ త‌ర్వాత కేసీఆర్ మీటింగ్‌లో కార్మికుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ముఖ్య‌మైన వ‌రాలు 1. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత 2.55 రోజుల సమ్మె కాలానికి జీతం ఒకేసారి అకౌంట్లో క్రెడిట్‌ 3.పదవీ విరమణ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పొడిగింపు 4. ప్రతి ఏటా […]

Advertisement
Update:2019-12-01 13:56 IST

ఆర్టీసీ స‌మ్మె ముగిసిన త‌ర్వాత కార్మికుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వారితో క‌లిసి భోజ‌నం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం వారి ద‌గ్గ‌ర నుంచి సూచ‌న‌లు తీసుకున్నారు. ఆ త‌ర్వాత కేసీఆర్ మీటింగ్‌లో కార్మికుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు.

ముఖ్య‌మైన వ‌రాలు

1. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత

2.55 రోజుల సమ్మె కాలానికి జీతం ఒకేసారి అకౌంట్లో క్రెడిట్‌

3.పదవీ విరమణ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పొడిగింపు

4. ప్రతి ఏటా బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయిస్తాం

5 సోమ‌వారం సెప్టెంబర్ వేతనం చెల్లింపు

6. టైమ్ ప్ర‌కారం ఉద్యోగుల ఇంక్రిమెంట్

7. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.

8. సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.

9. కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.

10. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి

11. ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి

12. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.

13. మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.

14. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.

15. రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు.

16. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం.

17. ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించడం….. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు.

18. ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు.

19. ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించడం.

20. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.

21. ఉద్యోగుల పిఎఫ్ బకాయిలను, సిసిఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.

22. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం.

23. ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.

24. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి.

Tags:    
Advertisement

Similar News