ఊబకాయంపై పోరాటం..10 మందిని నామినేట్ చేసిన ప్రధాని
వంటనూనె వినియోగాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించుకోవాలని 'మన్ కీ బాత్' లో మోడీ పిలుపు
Advertisement
ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడారు. వంటనూనె వినియోగాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచుకోవడానికి 10 ప్రముఖులను తాను నామినేట్ చేస్తున్నానని తాజాగా తెలిపారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, మనూబాకర్, మోహన్‌లాల్, మాధవన్, శ్రేయాఘోషల్, సుధామూర్తి, మీరా బాయ్ చానూ, నందన్ నిలేకని తదితర ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.
Advertisement