గుజరాత్‌ లాబీయింగ్‌కు మరాఠాల చెక్‌

రాష్ట్రపతి భవన్‌ నుంచి, రాజ్‌భవన్‌ వరకు తమ చేతుల్లో పెట్టుకుని బీజేపీ సాగించిన మహారాష్ట్ర రాజకీయం బెడిసికొట్టింది. మెజారిటీ లేకపోయినా రాజ్‌భవన్‌ను అడ్డుపెట్టుకుని నాయకులతో ప్రమాణస్వీకారం చేయించిన అమిత్ షా బృందం… కర్నాటకలో తరహాలోనే మహారాష్ట్రలోనూ భంగపడింది. ఓట్లేసిన ప్రజలకు కూడా తెలియకుండా తెల్లవారే సరికి రాజకీయం మార్చేసి ఫడ్నవీస్‌, అజిత్ పవార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేత కూడా రాష్ట్రపతి డిజిటల్ సంతకంతో జరిగిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ కూడా వ్యవస్థలపై అనుమానాలను […]

Advertisement
Update:2019-11-27 03:14 IST

రాష్ట్రపతి భవన్‌ నుంచి, రాజ్‌భవన్‌ వరకు తమ చేతుల్లో పెట్టుకుని బీజేపీ సాగించిన మహారాష్ట్ర రాజకీయం బెడిసికొట్టింది. మెజారిటీ లేకపోయినా రాజ్‌భవన్‌ను అడ్డుపెట్టుకుని నాయకులతో ప్రమాణస్వీకారం చేయించిన అమిత్ షా బృందం… కర్నాటకలో తరహాలోనే మహారాష్ట్రలోనూ భంగపడింది. ఓట్లేసిన ప్రజలకు కూడా తెలియకుండా తెల్లవారే సరికి రాజకీయం మార్చేసి ఫడ్నవీస్‌, అజిత్ పవార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేత కూడా రాష్ట్రపతి డిజిటల్ సంతకంతో జరిగిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ కూడా వ్యవస్థలపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

మహారాష్ట్రలో అమిత్ షా సామర్థ్యం పనిచేయకపోవడాన్ని అంతర్గతంగా గుజరాత్‌ లాబీయింగ్‌కు, మరాఠా శక్తులకు మధ్య జరిగిన యుద్ధంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఆర్థిక రాజధాని ముంబాయిలో గుజరాత్ వ్యాపార, రాజకీయ లాబీయింగ్‌ను నిరోధించేందుకు స్థానిక మరాఠా నేతలంతా ఏకమైనట్టు చెబుతున్నారు.

మహారాష్ట్రలో గుజరాత్‌ శక్తులకు చెక్‌ పెట్టాలన్న లక్ష్యం కూడా శివసేన, శరద్‌పవార్‌ చేతులు కలపడం వెనుక ఉందని చెబుతున్నారు. శివసేన ఎమ్మెల్యేలను చీల్చిచడంలో బీజేపీ విజయవంతం కాకపోవడానికి కారణం ముంబాయి కోణంలో కొందరు విశ్లేషిస్తున్నారు.

శివసేన ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్రయత్నిస్తే ముంబాయిలో గుజరాత్‌ వ్యాపార వర్గాలకు శివసేన వ్యతిరేకమయ్యే అవకాశం ఉండేది. ఆ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతోనే బీజేపీకి ఇక్కడ గుజరాత్ లాబీయింగ్‌ పూర్తి స్థాయిలో సహకరించలేదన్న భావన కూడా వ్యక్తమవుతోంది.

మొత్తం మీద దేశంలో అన్ని రాష్ట్రాలపైనా పట్టుకోసం ప్రయత్నిస్తున్న గుజరాత్‌ లాబీయింగ్‌కు మురాఠాల రూపంలో పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టు భావిస్తున్నారు. భిన్న భాషలు, భిన్న సంస్కృతలతో ఉన్న రాష్ట్రాలు… తమపై మరొకరి అధిపత్యాన్ని సవాల్ చేయడానికి… మరాఠాలను స్పూర్తిగా తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News