కార్మికులను విధుల్లో చేర్చుకోవడం కుదరదు...

సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించినప్పటికీ కార్మికులను విధుల్లోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం మాత్రం ప్రతికూలంగా స్పందించింది. సమ్మె చేయాల్సిందిగా ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ చెప్పలేదని… కార్మికులు వారి ఇష్టానికి సమ్మె చేసి వారి ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం కుదరదని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. సీఎం కేసీఆర్‌తో సమీక్ష అనంతరం సునీల్ శర్మ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం విధుల్లో చేరుతామని ఆర్టీసీ జేఏసీ చేసిన […]

Advertisement
Update:2019-11-26 03:30 IST

సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించినప్పటికీ కార్మికులను విధుల్లోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం మాత్రం ప్రతికూలంగా స్పందించింది.

సమ్మె చేయాల్సిందిగా ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ చెప్పలేదని… కార్మికులు వారి ఇష్టానికి సమ్మె చేసి వారి ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం కుదరదని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు.

సీఎం కేసీఆర్‌తో సమీక్ష అనంతరం సునీల్ శర్మ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం విధుల్లో చేరుతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని శర్మ వ్యాఖ్యానించారు.

ఒక వైపు పోరాటం కొనసాగుతుంది అంటూనే విధుల్లో చేరుతామని జేఏసీ చెప్పడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఇష్టమొచ్చినప్పు డు విధులకు గైర్హాజరై, మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలోనూ ఉండదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి ముఖ్య పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారని… కార్మికులు ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం అయ్యే పనికాదని సునీల్ శర్మ ప్రకటించారు.

ఆర్టీసీ యాజమాన్యం చట్టప్రకారమే తదుపరి చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మికశాఖ కమిషన్ తగు నిర్ణయం తీసుకుంటుందని.. అంత వరకు కార్మికులను విధుల్లో చేర్చుకునే అవకాశం లేదన్నారు.

సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సేవలను అందిస్తున్న తాత్కాలిక సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడి చేసినా, వారిని అడ్డుకున్నా కఠిన చర్యలు తప్పవని సునీల్ శర్మ హెచ్చరించారు. డిపోల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని … ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆర్టీసీ యాజమాన్యం క్షమించబోదన్నారు.

Tags:    
Advertisement

Similar News