సీఎం కేసీఆర్, గవర్నర్ మ‌ధ్య గ్యాప్ క్రియేట్ అయిందా?

సుదీర్ఘంగా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ తో కేసీఆర్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. కనీసం రెండు వారాలకు ఒకసారైనా గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ అయ్యేవారు. పరిపాలనకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత ఆధ్యాత్మిక విషయాలను పంచుకునేవారు. గంటలు గంటలు ఇద్దరి మధ్య చర్చలు జరిగినా… ఏ విషయమూ బయటకు వచ్చేది కాదు… అది కెసీఆర్, మాజీ గవర్నర్ నరసింహన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం. కానీ కొత్తగా వచ్చిన గవర్నర్ కి […]

Advertisement
Update:2019-11-24 04:21 IST

సుదీర్ఘంగా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ తో కేసీఆర్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. కనీసం రెండు వారాలకు ఒకసారైనా గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ అయ్యేవారు. పరిపాలనకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత ఆధ్యాత్మిక విషయాలను పంచుకునేవారు. గంటలు గంటలు ఇద్దరి మధ్య చర్చలు జరిగినా… ఏ విషయమూ బయటకు వచ్చేది కాదు… అది కెసీఆర్, మాజీ గవర్నర్ నరసింహన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం.

కానీ కొత్తగా వచ్చిన గవర్నర్ కి కేసీఆర్‌ మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 10 మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్‌ రాజ్ భవన్ వైపు కూడా వెళ్లలేదు. పండుగలకు పబ్బాలకు కూడా వెళ్లి శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు. ఏ రాజకీయ అంశంపై కూడా కొత్త గవర్నర్ తో కేసీఆర్ ఇంతవరకు భేటీ కాలేదు.

దీనిపైన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నియమించిన కొత్త గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సహకరించడం లేదన్న అభిప్రాయంతో…. కేసీఆర్‌ ఉన్నారా? ఇందుకోసమే కొత్త గవర్నర్ తో తెలంగాణ సర్కార్ అంత సఖ్యత పాటించ లేకపోతుందా? అన్నది రాజకీయవర్గాల్లో చ‌ర్చ కొన‌సాగుతోంది.

Tags:    
Advertisement

Similar News