ఏపీ రాజధానిగా అమరావతి.. కొత్త మ్యాప్ విడుదల

జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన సందర్భంగా అధికారికంగా గెజిట్ విడుదల చేసిన కేంద్రం అందులో ఏపీ రాజధానిని గుర్తించలేదు. దీంతో ఇది పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే. ఏపీకి రాజధాని లేదా అని వైసీపీ ప్రభుత్వంపై, కేంద్రంలోని బీజేపీపై అందరూ విమర్శలు చేశారు.  ఎట్టకేలకు కేంద్రం దాన్ని సరిదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని గుర్తించింది. పొరపాటు జరిగిందో.. లేక నిరసన సెగకో తెలియదు కానీ తాజాగా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొత్త పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. […]

Advertisement
Update:2019-11-23 06:00 IST

జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన సందర్భంగా అధికారికంగా గెజిట్ విడుదల చేసిన కేంద్రం అందులో ఏపీ రాజధానిని గుర్తించలేదు. దీంతో ఇది పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే. ఏపీకి రాజధాని లేదా అని వైసీపీ ప్రభుత్వంపై, కేంద్రంలోని బీజేపీపై అందరూ విమర్శలు చేశారు.

ఎట్టకేలకు కేంద్రం దాన్ని సరిదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని గుర్తించింది. పొరపాటు జరిగిందో.. లేక నిరసన సెగకో తెలియదు కానీ తాజాగా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొత్త పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం.

కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో కొత్త మ్యాప్ ను షేర్ చేశాడు. ఈ మ్యాప్ లో భారత దేశం, రాష్ట్రాల రాజధానులు, ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించారు.

తాజాగా కొత్త భారతదేశపు మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతిని కేంద్రం గుర్తించ లేదంటూ పలువురు ఎంపీలు నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర హోంశాఖ కొత్త మ్యాప్ లో అమరావతిని గుర్తించి తాజాగా విడుదల చేసింది. తాజా మ్యాప్ రిలీజ్ తో ఏపీ రాజధాని గొడవ కొంత వరకు సద్ధుమణిగినట్లు అయింది.

Tags:    
Advertisement

Similar News