ఎన్‌హెచ్ఆర్‌సీ నూతన చైర్మన్‌గా వి.రామసుబ్రమణ్యం నియామకం

జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు.

Advertisement
Update:2024-12-24 11:39 IST

జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం జూన్‌1తో ముగియడంతో ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌ పదవి ఖాళీగా ఉంది. కొత్త చైర్‌పర్సన్‌ ఎంపిక కోసం డిసెంబర్‌ 18న సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నియమించారు. చైర్మన్‌ రామసుబ్రమణియన్‌తోపాటు సభ్యులుగా ప్రియాంక్‌ కనూంగో, డాక్టర్‌ బిద్యుత్‌ రంజన్‌ సారంగి (రిటైర్డ్‌)లను నియమిస్తున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలిపింది. కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) చైర్‌ పర్సన్‌గా పనిచేశారు.

గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్‌ఎల్‌ దత్తు, కేజీ బాలకృష్ణన్‌ ఉన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్‌ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే లోపభూయిష్టంగా సాగిందని తన అసహనం తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘ఈ తరహా అంశాల్లో పరస్పర సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన వంటి సంప్రదాయాన్ని విస్మరించారు. సమావేశంలో లేవనెత్తిన చట్టబద్ధమైన ఆందోళనలను పక్కనపెట్టి, పేర్లను ఖరారు చేయడానికి సంఖ్యాపరమైన మెజార్టీపై ఆధారపడ్డారు’’ అని మల్లికార్జున ఖర్గే ఆరోపించింది.

Tags:    
Advertisement

Similar News