ఈ ఘటన చూస్తే భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉన్నాయనేది నిజమే!
రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘటన. ప్రయాణిస్తున్న కారు ఏకంగా 8 సార్లు పల్టీలు కొట్టినా.. వారికి చిన్న గాయమూ కాలేదు
రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన చూస్తే భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉన్నాయని అనిపించక మానదు. ప్రమాదంతో మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ ఐదుగురు అదృష్టవశాత్తూ క్షేమంగా బైటపడ్డారు. వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఏకంగా 8 సార్లు పల్టీలు కొట్టినా.. వారికి చిన్న గాయమూ కాలేదు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్ బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. సెకన్ల వ్యవధిలోనే కనీసం ఎనిమిది సార్లు పల్టీలు కొట్టి ఓ కారు షోరూమ్ గేటుపై బోల్తాపడింది.
భయానకంగా జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కారు పల్టీలు కొడుతున్న సమయంలో అందులోని ప్రయాణికులు బైటికి దూకేశారు. అంతేనా.. కారు షోరూమ్ లోపలికి వెళ్లి.. మాకు కొంచెం టీ ఇస్తారా అని అడిగాట. దీంతో ఆశ్యర్యపోవడం షోరూమ్ సిబ్బంది వంతు అయ్యింది!