ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది
రాష్ట్రపతికి హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు
Advertisement
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. ఈనెల 17న ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవాహానికి హాజరైన రాష్ట్రపతి అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేశారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా ఎట్ హోం నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Advertisement