నన్ను ఎలా వేధించాలో మాత్రమే బీజేపీకి తెలుసు
ఢిల్లీ విషయంలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదని కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ విషయంలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. వారికి ఇంతవరకు సీఎం అభ్యర్థి కూడా లేరని వ్యాఖ్యానించారు. నన్ను ఎలా వేధించాలో మాత్రమే బీజేపీకి తెలుసు అని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉంటే.. ఛార్జ్‌షీట్ లిస్ట్ (ఆరోప్ పత్ర) పేరుతో ఆప్ ప్రభుత్వం బీజేపీ విమర్శలు చేసింది. ఈ ప్రభుత్వం దేశంలో అత్యంత అసమర్థ పాలన సాగిస్తున్నది. అందరికీ ఉచిత నీరు అని వారు చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ట్యాంకర్లకు వేలకువేలు చెల్లించాల్సి వస్తున్నది. నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామన్నారు. కానీ వాయు నాణ్యత ఏ స్థాయిలో ఉన్నదో చూడండి. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. కానీ వారి మంత్రులే జైలుకు వెళ్లారు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు.
కేజ్రీవాల్ ప్రభుత్వం యమునా నదిని కాలుష్యమయంగా మార్చడంతో అక్కడ పండగలు చేసుకోవడమూ కుదరడం లేదు. కేజ్రీవాల్ జీ మీరు ఆ నదిలో పవిత్ర స్నానం చేస్తానన్నారు. ఆ స మయం వచ్చింది మరి అని సవాల్ విసిరారు. అలాగే మహిళల భద్రత గురించి ప్రశ్నలు వేశారు. నిర్భయ నిధులను ఎందుక వినియోగించలేకపోతున్నారని అడిగారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ స్పందన వచ్చింది.