మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్ నిరాకరణ

మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.

Advertisement
Update:2024-12-23 16:41 IST

యూపీఎస్సీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ట్రైనీ ఐఏఎస్ ఆఫీస‌ర్ పూజా ఖేద్క‌ర్‌కు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాక‌రించింది. అక్ర‌మ రీతిలో యూపీఎస్సీ ప‌రీక్ష‌ను ఆమె క్లియ‌ర్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. ఓబీసీ, దివ్యాంగ కోటాలో ల‌బ్ధి పొందేందుకు పూజా ఖేద్క‌ర్ .. యూపీఎస్సీని త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్లు జ‌స్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీస‌ర్ పూజా ఖేద్క‌ర్‌కు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాక‌రించింది. అక్ర‌మ రీతిలో యూపీఎస్సీ ప‌రీక్ష‌ను ఆమె క్లియ‌ర్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. ఓబీసీ, దివ్యాంగ కోటాలో ల‌బ్ధి పొందేందుకు పూజా ఖేద్క‌ర్ .. యూపీఎస్సీని త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్లు జ‌స్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొన్నారు.ఫేక్ డిజేబుల్ సర్టిఫికెట్‌లతో సివిల్స్‌లో ప్రయోజనలు పొందారన్న ఆరోపణాలపై ఆమెను కేంద్ర సర్వీస్‌ నుంచి తొలిగించింది.

దీంతో ఆమె ట్రయల్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో, ఆమెకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది.చీటింగ్ కేసులో పూజా ఖేడ్కర్ కు ఆగస్టులో హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది. అయితే, ఈ కేసులో సాక్ష్యాలు, ఆరోపణలను సమీక్షించిన తర్వాత హైకోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ లు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే, ఆమెపై కేసు నమోదైంది. యూపీఎస్సీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖేద్క‌ర్‌పై కేసు బుక్ చేశారు. అరెస్టు చేయ‌వ‌ద్దు అని ఆగ‌స్టు 12వ తేదీన తాత్కాలిక ర‌క్ష‌ణ క‌ల్పించారు. కానీ తాజా ఆదేశాల‌తో ఆ తీర్పును ర‌ద్దు చేయాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News