కాంగ్రెస్‌కు గడ్డి పెట్టిన విజయసాయిరెడ్డి..

ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిదంబరం అంశాన్ని కాంగ్రెస్ ప్రతినిధులు గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ ప్రస్తావించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ హోంమంత్రి చిదంబరాన్ని పార్లమెంట్‌ సమావేశాలకు ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ…. ఈ డిమాండ్ వినిపించేందుకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని వేదికగా చేసుకుంది. రాజ్యసభ ఎంపీగా ఉన్నచిదంబరంకు పార్లమెంట్‌కు హాజరయ్యే […]

Advertisement
Update:2019-11-17 17:17 IST

ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిదంబరం అంశాన్ని కాంగ్రెస్ ప్రతినిధులు గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ ప్రస్తావించారు.

ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ హోంమంత్రి చిదంబరాన్ని పార్లమెంట్‌ సమావేశాలకు ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ…. ఈ డిమాండ్ వినిపించేందుకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని వేదికగా చేసుకుంది. రాజ్యసభ ఎంపీగా ఉన్నచిదంబరంకు పార్లమెంట్‌కు హాజరయ్యే హక్కు ఉందని… పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేలా చిదంబరానికి బెయిల్ వచ్చేలా కేంద్రం కూడా సహకరించాలని కాంగ్రెస్ కోరింది.

కాంగ్రెస్‌ కోరికను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ చిదంబరానికి బెయిల్‌ ఇవ్వడానికి వీలు లేదని, ఒక జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం బెయిల్‌ ఇప్పించాలని ఎలా కోరుతారని ఆయన నిలదీశారు.

గతంలో కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం పార్లమెంట్‌ సభ్యుడు జగన్‌ మోహన్‌ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు బెయిల్‌ రాకుండా చూశాడని, చట్టాలను అపహాస్యం చేశాడని… అలాంటి వ్యక్తి ఇప్పుడు జైలుకు వెళ్ళాడని …. ఇప్పుడు ఆయనకు, ఆజాద్‌ గారికి పార్లమెంట్‌ సభ్యుల హక్కులు గుర్తొచ్చాయా? అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

జైలులో ఉన్నప్పుడు పార్లమెంట్‌ సమావేశాలకు రావడానికి జగన్‌ అనుమతి కోరితే ఇదే చిదంబరం హోం మంత్రిగా ఉండి ఆ పిటిషన్‌ ను రిజక్ట్‌ చేశాడని …. కోర్టు పరిధిలో ఉన్న అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని అన్నాడని అదే చిదంబరం ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని తనను జ్యుడిషియల్‌ కస్టడీ నుంచి బయటకు తీసుకు రావడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

చట్టం ముందు అందరూ సమానులేనని…. జగన్‌ కు ఒక న్యాయం, చిదంబరానికి ఒక న్యాయం ఉండదని స్పష్టం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోదని, అది యూపీఏ స్టాండ్‌ అని పేర్కొన్న చిదంబరం, గులాంనబీ ఆజాద్‌ లు ఇప్పుడు ఎందుకు మాట మార్చి యూటర్న్‌ తీసుకుంటున్నారని సాయిరెడ్డి ప్రశ్నించారు.

చిదంబరం ఎంపీగా ఉన్నారు కాబట్టి సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మరి తాను కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో గుర్తుచేసుకోవాలని కోరారు. విజయసాయిరెడ్డి ఇలా నిలదీయడంతో కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు.

కాంగ్రెస్‌ ప్రతినిధులకు ధీటుగా సమాధానం ఇచ్చిన విజయసాయిరెడ్డి… న్యాయం, చట్టం జగన్‌మోహన్ రెడ్డికి ఒకలా, చిదంబరానికి ఒకలా పనిచేస్తుందా అని నిలదీశారు. తిరిగి కాంగ్రెస్ ప్రతినిధులు విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా తనకు శ్రమ లేకుండా కాంగ్రెస్‌కు తాను చెప్పాల్సిన సమాధానాన్ని విజయసాయిరెడ్డి చెప్పడంతో లోలోపల సంతోషపడ్డ అమిత్ షా .. ఈ విషయం కేంద్రం చేతిలో లేదని కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News