నీలం సహానిని రిలీవ్ చేసిన కేంద్రం... ఏపీ సీఎస్‌గా చాన్స్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానిని కేంద్రం రిలీవ్ చేసింది. ఏపీ కేడర్‌కు చెందిన ఆమె ప్రస్తుతం కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. నీలం సహాని భర్త ఏపీ సహాని కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అధికారే. నీలం సహానిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన రోజే నీలం సహాని … ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. కలిసి భోజనం చేశారు. ఏపీ సీఎస్‌గా […]
సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానిని కేంద్రం రిలీవ్ చేసింది. ఏపీ కేడర్‌కు చెందిన ఆమె ప్రస్తుతం కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. నీలం సహాని భర్త ఏపీ సహాని కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అధికారే.
నీలం సహానిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన రోజే నీలం సహాని … ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. కలిసి భోజనం చేశారు. ఏపీ సీఎస్‌గా పనిచేసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. అందుకోసం ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. నీలం సహాని 1984 బ్యాచ్ అధికారిణి.
ఉమ్మడి ఏపీలో ఆమె పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. ఆమెకు పరిపాలన అంశాలపై మంచి పట్టు ఉంది.
నీలం సహాని భర్త 2014లో చంద్రబాబు పేషీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. చంద్రబాబుతో మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
గతంలో చంద్రబాబు పేషీలో కీలక పాత్ర పోషించిన అజయ్ సహాని భార్య నీలం సహానిని జగన్‌మోహన్ రెడ్డి కొత్త సీఎస్‌గా నియమించేందుకు సిద్ధమవడంతో ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నీలం సహాని నియామక నిర్ణయం పట్ల… చంద్రబాబు హయాంలో టీడీపీకి అనుకూలంగా పనిచేసి ప్రస్తుతం లూప్‌లో ఉన్న ఐఏఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.