ఏ సమస్యా లేక ఇసుక అంశాన్ని పట్టుకున్నారు

ఇసుక కొరతపై మైనింగ్‌ శాఖ, పోలీసు శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. దీనిపై తక్షణం ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారిని జైలుకు పంపేలా చట్టం తెస్తామన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా […]

Advertisement
Update:2019-11-06 11:42 IST

ఇసుక కొరతపై మైనింగ్‌ శాఖ, పోలీసు శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. దీనిపై తక్షణం ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇసుక అక్రమ రవాణా చేసిన వారిని జైలుకు పంపేలా చట్టం తెస్తామన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. చెక్‌పోస్టులను మరింత పటిష్టం చేయాలని… సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రాత్రిపూట కూడా పనిచేసేలా చూడాలని, అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు.

ఇసుక రీచ్‌లలో 275కు గాను 83 పనిచేస్తున్నాయని అధికారులు వివరించారు. వాతావరణం అనుకూలించగానే వెంటనే 275 రీచ్‌లను అందుబాటులోకి తేవాలని జగన్ ఆదేశించారు.

ప్రతిపక్షాలు ఇసుక విషయంలో శవరాజకీయాలు చేస్తున్నాయని జగన్ విమర్శించారు. ఏ సమస్య దొరక్కపోవడంతో ఇసుక అంశాన్ని ప్రతిపక్షాలు పట్టుకున్నాయన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాయితీగా పనిచేస్తున్నా సరే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ మంచి మనసుతో పనిచేస్తే ఖచ్చితంగా దేవుడు సహకరిస్తాడని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News