ఆర్టీసీని అమ్మేందుకే కేసీఆర్ ఈ ప్లాన్...
ఆర్టీసీని సగం ప్రైవేటీకరించిన సీఎం కేసీఆర్ నిర్ణయంపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు రెండు నెలలుగా పస్తులుంటూ సమ్మె చేస్తుంటే…. మానవత్వం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్టు చేస్తానంటున్నారని.. చస్తే చావండి అన్నట్లు కేసీఆర్ తీరు ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆర్టీసీని అమ్మేసేందుకే నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. […]
ఆర్టీసీని సగం ప్రైవేటీకరించిన సీఎం కేసీఆర్ నిర్ణయంపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు రెండు నెలలుగా పస్తులుంటూ సమ్మె చేస్తుంటే…. మానవత్వం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్టు చేస్తానంటున్నారని.. చస్తే చావండి అన్నట్లు కేసీఆర్ తీరు ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆర్టీసీని అమ్మేసేందుకే నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతున్నా.. కేసీఆర్ కు చీమ కుట్టినట్టు అయినా లేదని మండిపడ్డారు.
కేసీఆర్ ను తెలంగాణ ఒక్క క్షణం కూడా భరించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఏపీని ఎప్పుడూ డామినేట్ చేస్తుంటాడని.. ఇప్పుడు ఆర్టీసీ విషయంలో ఏపీని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తేల్చేయడం.. ప్రతిపక్షాలను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి నెట్టేశాయి. ఇక ఆర్టీసీ కార్మికులు సైతం దీనిపై పునరాలోచనలో పడి సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తెలంగాణ ఇక ఒక్క క్షణం కూడా నిన్ను భరించలేదు…
Posted by Anumula Revanth Reddy on Saturday, 2 November 2019