బాలయ్య అల్లుడి, కూతురి ఆస్తుల వేలం !
దేశవ్యాప్తంగా మొండి బకాయిల వసూళ్లపై బ్యాంకులు ప్రత్యేక దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా బకాయిలు ఎగ్గొట్టిన బడాబాబులు, వారి కంపెనీలపై దృష్టి పెట్టాయి. మొండి బకాయిల వసూళ్లకు పారిశ్రామిక వేత్తల వెంటపడుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో మొన్నటివరకు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల లీలలు, వారి కంపెనీల బాగోతాలు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. మొన్నటి దాకా సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావులతో పాటు టీడీపీ నేతల ఆస్తుల వేలానికి పలు ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ […]
దేశవ్యాప్తంగా మొండి బకాయిల వసూళ్లపై బ్యాంకులు ప్రత్యేక దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా బకాయిలు ఎగ్గొట్టిన బడాబాబులు, వారి కంపెనీలపై దృష్టి పెట్టాయి. మొండి బకాయిల వసూళ్లకు పారిశ్రామిక వేత్తల వెంటపడుతున్నాయి.
తెలుగురాష్ట్రాల్లో మొన్నటివరకు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల లీలలు, వారి కంపెనీల బాగోతాలు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. మొన్నటి దాకా సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావులతో పాటు టీడీపీ నేతల ఆస్తుల వేలానికి పలు ప్రకటనలు వచ్చాయి.
ఇప్పుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఆస్తుల వేలానికి ప్రకటనలు దినపత్రికల్లో కనిపిస్తున్నాయి. బాలయ్య చిన్న కూతురు & చిన్న అల్లుడు ఆస్తి ఆంధ్రా బాంక్ స్వాధీనం చేసుకుంటుంది అనే అధికారిక ప్రకటన వెలువడింది.
భరత్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయారు. గీతం విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తి మనవడు భరత్. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు కూడా మనవడు.
సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం తీసుకున్న 13 కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో బాలయ్య అల్లుడు భరత్, ఆయన కూతురు తేజస్వినితో పాటు తనఖాదారులుగా ఉన్న మిగతా ఆస్తులు వేలం వేసేందుకు ఆంధ్రాబ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పత్రికా ప్రకటన ఇచ్చింది.
విశాఖపట్నం సీతమ్మధార ఆంధ్రాబ్యాంక్ ఈ వేలం ప్రక్రియ నిర్వహించబోతుంది. మొత్తం ఆరుగురు తనఖాదారులకు చెందిన భూమిని త్వరలోనే వేలం వేయబోతుంది.