టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ జోరు
38 పాయింట్లు కోల్పోయిన విరాట్ కొహ్లీ టాప్ -10 లో రవిచంద్రన్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టాపర్ భారత్ కు…విశాఖ టెస్ట్ ముగిసిన తర్వాత ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ మిశ్రమఫలితాలను ఇచ్చాయి. డాషింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తమతమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరచుకోగా… కెప్టెన్ విరాట్ కొహ్లీ ర్యాంకింగ్ పాయింట్లు మాత్రం మ్యాచ్ మ్యాచ్ కూ తగ్గిపోతు వస్తున్నాయి. ఐసీసీ వెలువరించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ 36 స్థానాల మేర తన ర్యాంక్ […]
- 38 పాయింట్లు కోల్పోయిన విరాట్ కొహ్లీ
- టాప్ -10 లో రవిచంద్రన్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టాపర్ భారత్ కు…విశాఖ టెస్ట్ ముగిసిన తర్వాత ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ మిశ్రమఫలితాలను ఇచ్చాయి. డాషింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తమతమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరచుకోగా… కెప్టెన్ విరాట్ కొహ్లీ ర్యాంకింగ్ పాయింట్లు మాత్రం మ్యాచ్ మ్యాచ్ కూ తగ్గిపోతు వస్తున్నాయి.
ఐసీసీ వెలువరించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ 36 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగు పరచుకొన్నాడు. విశాఖపట్నం వేదికగా సౌతాప్రికాతో ముగిసిన తొలిటెస్టు తొలిఇన్నింగ్స్ లో 176, రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులు సాధించడంతో పాటు…13 సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పడం ద్వారా భారీగా ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 17వ ర్యాంకులో నిలిచాడు.
మరో ఓపెనర్, డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 25వ ర్యాంక్ సాధించాడు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం 38 పాయింట్ల మేరకు కోల్పోయి…టాప్ ర్యాంకర్ స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్ -10లో అశ్విన్…..
విశాఖ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ 710 ర్యాంకింగ్ పాయింట్లతో 18వ ర్యాంక్ లో నిలిచాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా రెండో ర్యాంక్ సాధించడం విశేషం.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో స్టీవ్ స్మిత్, బౌలర్ల ర్యాంకింగ్స్ లో యాండీ కమిన్స్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.