ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన.. ఉద్రిక్త పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలో గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు.

Advertisement
Update:2025-02-24 10:28 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు. వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో శాసనసభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు సభను బాయ్ కాట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News