రవీంద్ర జడేజా టెస్ట్ వికెట్ల డబుల్ సెంచరీ

అత్యంత వేగంగా 200 వికెట్ల రికార్డు 10వ భారత బౌలర్ రవీంద్ర జడేజా భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన లెఫ్టామ్ బౌలర్ గా నిలిచాడు. శ్రీలంక స్పిన్నర్ రంగన్ హెరాత్ పేరుతో ఉన్న రికార్డును జడేజా అధిగమించాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా…విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్ మూడోరోజు ఆటలో… రవీంద్ర జడేజా ఈ ఘనతను సాధించాడు. సఫారీ […]

Advertisement
Update:2019-10-05 01:51 IST
  • అత్యంత వేగంగా 200 వికెట్ల రికార్డు
  • 10వ భారత బౌలర్ రవీంద్ర జడేజా

భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన లెఫ్టామ్ బౌలర్ గా నిలిచాడు.

శ్రీలంక స్పిన్నర్ రంగన్ హెరాత్ పేరుతో ఉన్న రికార్డును జడేజా అధిగమించాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా…విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్ మూడోరోజు ఆటలో… రవీంద్ర జడేజా ఈ ఘనతను సాధించాడు.

సఫారీ ఓపెనర్, సెంచరీ హీరో డీన్ ఎల్గర్ ను అవుట్ చేయడం ద్వారా జడేజా… టెస్ట్ క్రికెట్లో తన వికెట్ల డబుల్ సెంచరీని పూర్తి చేయగలిగాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన లెఫ్టామ్ బౌలర్ గా జడేజా నిలిచాడు.

44 టెస్టుల్లోనే 200 వికెట్ల జడేజా…

2012 ఇంగ్లండ్ సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన టెస్ట్ ద్వారా అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా..ప్రస్తుత విశాఖ టెస్ట్ వరకూ ఆడిన 44 మ్యాచ్ ల్లో 200 వికెట్లు పడగొట్టాడు. తొమ్మిదిసార్లు 5 వికెట్ల చొప్పున, ఏడుసార్లు నాలుగు వికెట్ల చొ్ప్పున, ఒకసారి 10 వికెట్ల చొప్పున పడగొట్టిన ఘనత జడేజాకు ఉంది.

ఇంతకు ముందు వరకూ 47 టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టిన లెఫ్టామ్ బౌలర్ గా ఉన్న రంగన్ హెరాత్ రికార్డును జడేజా 44 టెస్టుల్లోనే సాధించడం ద్వారా తెరమరుగు చేశాడు.

మిషెల్ జాన్సన్ 49, మిషెల్ స్టార్క్ 50, వాసిం అక్రం, బిషిన్ సింగ్ బేడీ 51 టెస్టుల్లోనూ 200 వికెట్లు మైలురాయిని చేరిన లెఫ్టామ్ బౌలర్లుగా ఉన్నారు.

10వ భారత బౌలర్ జడేజా…

టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు సాధించిన భారత 10వ బౌలర్ గా రవీంద్ర జడేజా రికార్డుల్లో చేరాడు. జడేజా కంటే ముందే ఈ ఘనత సాధించిన బౌలర్లలో అనీల్ కుంబ్లే, బిషిన్ సింగ్ బేడీ, జవగళ్ శ్రీనాథ్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, బీఎస్ చంద్రశేఖర్, జహీర్ ఖాన్ తదితరులు ఉన్నారు.

జడేజాకు 156 వన్డేల్లో 178 వికెట్లు, 44 టీ-20 మ్యాచ్ ల్లో 33 వికెట్లు పడగొట్టిన రికార్డులు సైతం ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News