శుక్రవారం మోడీని కలవనున్న కేసీఆర్

రెండోసారి అటు కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండోసారి గెలిచారు. అయితే ఎన్నికల సంగ్రామంలో మోడీ, కేసీఆర్ ల మాటల తూటాలు.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయడంతో మోడీ గుస్సా అయిపోయి కేసీఆర్ ను దూరం పెట్టారన్న ప్రచారం సాగింది. అప్పటినుంచి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినా మోడీ ఇవ్వలేదన్న టాక్ నడిచింది. తాజాగా మోడీతో కేసీఆర్ భేటికి ముహూర్తం కుదిరింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో కేసీఆర్ […]

Advertisement
Update:2019-10-02 11:15 IST

రెండోసారి అటు కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండోసారి గెలిచారు. అయితే ఎన్నికల సంగ్రామంలో మోడీ, కేసీఆర్ ల మాటల తూటాలు.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయడంతో మోడీ గుస్సా అయిపోయి కేసీఆర్ ను దూరం పెట్టారన్న ప్రచారం సాగింది. అప్పటినుంచి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినా మోడీ ఇవ్వలేదన్న టాక్ నడిచింది.

తాజాగా మోడీతో కేసీఆర్ భేటికి ముహూర్తం కుదిరింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో కేసీఆర్ సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యలతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ కోరనున్నట్టు సమాచారం. గురువారమే కేసీఆర్ ఢీల్లీ బయలు దేరి వెళుతున్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా వీరిద్దరి భేటి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ కక్షలు, అలకలు వీడి వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారా? అసలు వ్యూహం ఏంటన్నది ఆసక్తిగా మారింది.

తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీకి ఇప్పుడు కేసీఆరే ప్రత్యర్థి. ఇలాంటి సమయంలో మోడీతో కేసీఆర్ భేటి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా మోడీతో సమావేశం వెనుక భవిష్యత్ రాజకీయాల చెలిమి ఉండవచ్చన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News