మా ఊరిలో దాదాపు జనసేనే.. కానీ 8 మందికి ఉద్యోగాలొచ్చాయి.. జగన్‌ నిర్ణయం అభినందనీయం... నిందలు అమానుషం

గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలుంటాయని బీజేపీ నేత చందు సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల క్రితమే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాంబశివరావు… సచివాలయ ఉద్యోగాల భర్తీపై టీడీపీ చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. ఉద్యోగాలు సాధించిన పిల్లలపై నిందలు వేయడం దుర్మార్గమని, అమానుషం అని వ్యాఖ్యానించారు. ”జగన్‌ నిర్ణయాన్ని వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ అభినందిస్తున్నాం. లక్షల మంది యువత చదువుకుని, ప్రతిభ ఉండి కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందిపడుతున్నారు. ఇది దేశ సమస్య. […]

Advertisement
Update:2019-10-02 03:31 IST

గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలుంటాయని బీజేపీ నేత చందు సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల క్రితమే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాంబశివరావు… సచివాలయ ఉద్యోగాల భర్తీపై టీడీపీ చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. ఉద్యోగాలు సాధించిన పిల్లలపై నిందలు వేయడం దుర్మార్గమని, అమానుషం అని వ్యాఖ్యానించారు.

”జగన్‌ నిర్ణయాన్ని వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ అభినందిస్తున్నాం. లక్షల మంది యువత చదువుకుని, ప్రతిభ ఉండి కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందిపడుతున్నారు. ఇది దేశ సమస్య. పనిచేయగలిగే వారు ఉండి కూడా వారికి పనిలేకపోవడం బాధాకరం. పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.

ఓవర్‌ నైట్‌ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ఏ ప్రభుత్వానికి వీలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ మంచి ఆలోచన చేశారు. పిల్లలు చదువుకుని తిరిగి కోచింగ్‌ కోసమంటూ అమీర్‌పేటలో ఉంటున్నారు. అక్కడ కోచింగ్ తీసుకున్నా అందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. తిరిగి ఏడాది తర్వాత వారు నిరాశతో సొంతూర్లకు వచ్చేస్తున్నారు.

వ్యవసాయం చేయలేక, అటు ఉద్యోగం లేక డైలమాలో ఉండిపోతున్నారు. అలాంటి యువతను గ్రామీణ ప్రాంతంవైపే మళ్లించి… వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం నిజంగా అభినందించదగ్గ విషయం. వారికి 5వేలు ఇస్తారా 20వేలు ఇస్తారా అన్నది చర్చనీయాంశం కాదు. ఎంత ఇచ్చినా తిరిగి సమాజంలోకే ఆ డబ్బు వస్తుంది… మన పిల్లలకే ఇస్తున్నాం.

అమెరికాలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు పెద్దజీతాలు తీసుకునే వారు వారి జీతాల నుంచి 5శాతం, 10 శాతం త్యాగం చేసి చిన్న ఉద్యోగులకు ఆసరాగా ఉంటారు. ఇక్కడ మన ఉద్యోగులు అలాంటి త్యాగాలు చేస్తారని అనుకోలేం గానీ… చిన్న చిన్న ఉద్యోగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

మా గ్రామం చక్రయపాలెం. 99 శాతం మంది ఒకే సామాజికవర్గం. మొన్నటి ఎన్నికల్లో జగన్‌కు ఎక్కువ ఓట్లు వేయలేదు. జనసేనకే ఎక్కువ ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో ఏడెనిమిది మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇలాంటప్పుడు ఉద్యోగాలు వచ్చిన వారు ఏ కులం, ఏ పార్టీ అని ఎలా మాట్లాడగలం?. ఉద్యోగాలు వచ్చిన వారంతా వైసీపీ, వారంతా అవినీతితో వచ్చారు, తెలివితేటలు లేవు, మార్కులు రాలేదు అని పిల్లలపై ముద్ర వేయడం దుర్మార్గం, అమానుషం” అని చందు సాంబశివరావు అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News