ఉద్యోగం రాని వారు బాధపడొద్దు... ప్రతి జనవరిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం

గ్రామ సచివాలయ ఉద్యోగాలను సాధించలేకపోయిన అభ్యర్థులు ఏమాత్రం అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. ప్రతి ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ప్రతి ఏటా జనవరి నెలను ఉద్యోగాల భర్తీకి ఉపయోగిస్తామన్నారు. ప్రతి శాఖలోని ఖాళీలను ప్రతి జనవరిలో భర్తీ చేస్తామన్నారు. కాబట్టి ఈసారి ఉద్యోగం రాని వారు బాధపడవద్దని కోరారు. ఒక జనవరి పోయినా మరో జనవరి వస్తుందని గుర్తించుకోండి అని జగన్ ధైర్యం చెప్పారు. 20 లక్షల […]

Advertisement
Update:2019-09-30 15:00 IST

గ్రామ సచివాలయ ఉద్యోగాలను సాధించలేకపోయిన అభ్యర్థులు ఏమాత్రం అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. ప్రతి ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ప్రతి ఏటా జనవరి నెలను ఉద్యోగాల భర్తీకి ఉపయోగిస్తామన్నారు. ప్రతి శాఖలోని ఖాళీలను ప్రతి జనవరిలో భర్తీ చేస్తామన్నారు. కాబట్టి ఈసారి ఉద్యోగం రాని వారు బాధపడవద్దని కోరారు. ఒక జనవరి పోయినా మరో జనవరి వస్తుందని గుర్తించుకోండి అని జగన్ ధైర్యం చెప్పారు.

20 లక్షల మంది పరీక్షలకు హాజరైనా ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించిన అధికారులకు తాను సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తే ఐఏఎస్‌లు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తారన్నది ఉద్యోగాల భర్తీ విషయంలో వారు చేసిన కృషిని బట్టి అర్థమవుతోందన్నారు.

”పంచాయతీ, మున్సిపల్ శాఖకు చెందిన అధికారులు గిరిజ ను, ద్వివేదీ అన్నను, విజయ్‌ను, శ్యాం అన్నను చూసినప్పుడు మన ఐఏఎస్‌లు ఎంత సమర్ధవంతంగా పనిచేయగలరో అర్థమైంది” అని సీఎం ప్రశంసించారు.

ఒక్కో జిల్లాల్లో సరాసరి లక్ష నుంచి రెండు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసినా ఎక్కడా చిన్న ఫిర్యాదు కూడా రాకుండా పరీక్షలు నిర్వహించడంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల చొరవను అభినందిస్తున్నట్టు చెప్పారు. అధికారులందరికీ సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అభినందించారు.

Tags:    
Advertisement

Similar News