భారత మహిళా టీ-20లో సరికొత్త రికార్డు

15 ఏళ్లకే షఫాలీకి టీ-20 క్యాప్  గర్గీ బెనర్జీ రికార్డు తెరమరుగు హర్యానా టీనేజర్ షఫారీ వర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. అతిపిన్న వయసులో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది. సూరత్ లోని లాలాబాయి కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా షఫాలీ అరంగేట్రం చేసింది. హర్యానాకు చెందిన 15 సంవత్సరాల షఫాలీ కేవలం 4 బాల్స్ మాత్రమే ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగింది. దూకుడుగా […]

Advertisement
Update:2019-09-25 09:24 IST
  • 15 ఏళ్లకే షఫాలీకి టీ-20 క్యాప్
  • గర్గీ బెనర్జీ రికార్డు తెరమరుగు

హర్యానా టీనేజర్ షఫారీ వర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. అతిపిన్న వయసులో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది.

సూరత్ లోని లాలాబాయి కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా షఫాలీ అరంగేట్రం చేసింది. హర్యానాకు చెందిన 15 సంవత్సరాల షఫాలీ కేవలం 4 బాల్స్ మాత్రమే ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగింది.

దూకుడుగా ఆడటానికి, భారీషాట్లు బాదటానికి మరోపేరుగా నిలిచే షఫాలీకి వెటరన్ మిథాలీ రాజ్ స్థానంలో భారతజట్టులో చోటు కల్పించారు.

ఇప్పటి వరకూ గర్గీ బెనర్జీ మాత్రమే అత్యంత పిన్నవయసులో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత మహిళగా ఉంది. ఆ రికార్డును షెఫాలీ అధిగమించగలిగింది.

Tags:    
Advertisement

Similar News