ప్రపంచ కుస్తీ తొలిరౌండ్లోనే సుశీల్ కుమార్ చిత్తు

ఎనిమిదేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఆశలపై నీళ్లు  ఆరు నిముషాలలోనే సుశీల్ కుమార్ అవుట్ భారత స్టార్ వస్తాదు సుశీల్ కుమార్ కు ప్రపంచ కుస్తీ పోటీల 74 కిలోల విభాగం అర్హత రౌండ్లోనే చుక్కెదురయ్యింది. కజకిస్థాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కుస్తీ పోటీల బరిలోకి సుశీల్ కుమార్ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దిగాడు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగిన సుశీల్ కు అజర్ బైజాన్ […]

Advertisement
Update:2019-09-20 12:30 IST
  • ఎనిమిదేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఆశలపై నీళ్లు
  • ఆరు నిముషాలలోనే సుశీల్ కుమార్ అవుట్

భారత స్టార్ వస్తాదు సుశీల్ కుమార్ కు ప్రపంచ కుస్తీ పోటీల 74 కిలోల విభాగం అర్హత రౌండ్లోనే చుక్కెదురయ్యింది. కజకిస్థాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కుస్తీ పోటీల బరిలోకి సుశీల్ కుమార్ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దిగాడు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగిన సుశీల్ కు అజర్ బైజాన్ వస్తాదు కడిజమురాద్ చేతిలో 9-11 పాయింట్ల తేడాతో ఓటమి తప్పలేదు.

కేవలం 6 నిముషాలపాటు జరిగిన ఈ పోటీ ప్రారంభంలో సుశీల్ ప్రత్యర్థిపై 9-4 పాయింట్ల ఆధిక్యంతో పైచేయి సాధించాడు. అయితే..ఆ తర్వాత వెంట వెంటనే ప్రత్యర్థికి 7 పాయింట్లు సమర్పించుకొన్న సుశీల్ 3 పాయింట్ల తేడాతో పరాజయం పొందాడు.

భారత్ కు ఒలింపిక్స్ లో రెండు పతకాలు అందించిన 36 ఏళ్ళ సుశీల్ కుమార్ 2018 ఆసియా క్రీడల్లో సైతం తొలిరౌండ్లోనే పరాజయం చవిచూశాడు.

2010లో మాస్కో వేదికగా ముగిసిన ప్రపంచ కుస్తీ పోటీలలో బంగారు పతకం సాధించిన సుశీల్ కుమార్ ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు.

Tags:    
Advertisement

Similar News