బాబు తీరుతోనే కోడెల ఆవేదన... బిజెపిలోకి వస్తానని ఫోన్ చేశాడు...

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య పట్ల బీజేపీ నేత పురిగళ్ల రఘురాం సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో కీలక విషయాన్ని ఆయన వెల్లడించారు. చంద్రబాబు తీరు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం తనతో కోడెల స్వయంగా ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారని వివరించారు. పార్టీకి కట్టుబడి నిజాయితీగా పని చేసిన వారికి బాబు నాయకత్వంలోని టీడీపీలో […]

Advertisement
Update:2019-09-18 02:53 IST

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య పట్ల బీజేపీ నేత పురిగళ్ల రఘురాం సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో కీలక విషయాన్ని ఆయన వెల్లడించారు.

చంద్రబాబు తీరు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం తనతో కోడెల స్వయంగా ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారని వివరించారు. పార్టీకి కట్టుబడి నిజాయితీగా పని చేసిన వారికి బాబు నాయకత్వంలోని టీడీపీలో విలువ లేదని కోడెల అవేదన చెందారని చెప్పారు.

పార్టీలో తనను ఒంటరిని చేశారని… తన మనసు క్షీణిస్తోంది అని… కోడెల తన వద్ద అవేదన చెందారని రఘురాం వెల్లడించారు. టీడీపీలో ఉండలేనని బిజెపిలోకి వస్తానని కోడెల చెప్పారని, త్వరలోనే అమిత్ షా ను కలుస్తానని చెప్పారని అంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి చంద్రబాబు రాజకీయమే కారణమని రఘురాం ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News