వీడియో వైరల్ : పడవ మునగడానికి 5 నిమిషాల ముందు....

పాపికొండలను చూడడానికి వెళ్లిన కొందరు పర్యాటకుల బతుకులు గోదారి నదీ గర్భంలో కలిసిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా మునిగిపోయిన పడవలో పర్యాటకులు తీసుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక పర్యాటకుడు ఫేస్ బుక్ లైవ్ తో పాటు వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో అతడి స్నేహితులు దాన్ని సోషల్ మీడియాలో షేర్ […]

Advertisement
Update:2019-09-16 10:49 IST

పాపికొండలను చూడడానికి వెళ్లిన కొందరు పర్యాటకుల బతుకులు గోదారి నదీ గర్భంలో కలిసిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే తాజాగా మునిగిపోయిన పడవలో పర్యాటకులు తీసుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక పర్యాటకుడు ఫేస్ బుక్ లైవ్ తో పాటు వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో అతడి స్నేహితులు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి 5 నిమిషాల ముందు ఈ వీడియో తీశాడు. యువకులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా సెల్ఫీలు, కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా సెల్ఫీలు దిగుతూ గోదారి అందాలను వీడియో, ఫొటోలు తీస్తూ పర్యాటకులు అంతా బిజీగా ఉన్నారు. పాటలకు నృత్యాలు చేశారు.

అయితే పడవలో ఉన్న వారందరూ లైఫ్ జాకెట్లు వేసుకోకపోవడం… వీడియోలో స్పష్టంగా కనిపించింది. పడవ ప్రమాదం జరిగినప్పుడు వీరు ఎవరూ జాకెట్లు వేసుకోకపోవడంతోనే మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. అదే అందరూ లైఫ్ జాకెట్లు వేసుకుని ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదంటున్నారు. పర్యాటకుల నిర్లక్ష్యమే వారి పాలిట శాపమైందని తాజాగా వారు తీసుకున్న చివరి వీడియోను బట్టి అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News