ప్రగతి భవన్‌లో కుక్క మృతి... వైద్యుడిపై కేసు నమోదు

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మృతి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. డాక్టర్‌పై కేసు కూడా నమోదైంది. ప్రగతి భవన్‌లో హస్కీ అనే కుక్క ఉంది. దీని వయసు 11 నెలలు. ఈనెల 11న కుక్క ఉదయం ఆహారం తినలేదు. పాలు తాగలేదు. డల్‌గా ఉండడంతో వైద్యుడిని పిలిపించారు. వైద్యుడు రంజిత్ పరీక్షించి కుక్కకు 102 డిగ్రీల జ్వరం వచ్చినట్టు నిర్ధారించాడు. అదే రాత్రి యానిమల్ కేర్ క్లినిక్‌లో కుక్కను చేర్చారు. […]

Advertisement
Update:2019-09-14 06:24 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మృతి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. డాక్టర్‌పై కేసు కూడా నమోదైంది.

ప్రగతి భవన్‌లో హస్కీ అనే కుక్క ఉంది. దీని వయసు 11 నెలలు. ఈనెల 11న కుక్క ఉదయం ఆహారం తినలేదు. పాలు తాగలేదు. డల్‌గా ఉండడంతో వైద్యుడిని పిలిపించారు.

వైద్యుడు రంజిత్ పరీక్షించి కుక్కకు 102 డిగ్రీల జ్వరం వచ్చినట్టు నిర్ధారించాడు.

అదే రాత్రి యానిమల్ కేర్ క్లినిక్‌లో కుక్కను చేర్చారు. ఆ రాత్రే కుక్క చనిపోయింది. దీనంతటికి డాక్టర్ రంజిత్, ఆస్పత్రి నిర్వాహకురాలు లక్ష్మీల నిర్లక్ష్యమే కారణమంటూ ప్రగతిభవన్‌ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

చనిపోయింది కేసీఆర్‌ ఇంట్లో కుక్క కావడంతో పోలీసులు డాక్టర్‌పై 429, 11 (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News