భారత షూటర్ల సరికొత్త రికార్డు
షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్స్ కు 14 మంది అర్హత ప్రపంచ షూటింగ్ లో భారత షూటర్లు సంచలనం సృష్టించారు. మొత్తం 14 మంది భారత షూటర్లు వివిధ విభాగాల ఫైనల్స్ కు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. చైనాలోని పుతియాన్ వేదికగా నవంబర్ 17 నుంచి 23 వరకూ జరిగే 2019 ప్రపంచకప్ షూటింగ్ మెడల్ రౌండ్లో పోటీపడనున్నారు. రెండు విభాగాల ఫైనల్స్ లో మను బాకర్.. మొత్తం 14 మంది షూటర్లలో ఇద్దరు మాత్రమే రెండు […]
- షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్స్ కు 14 మంది అర్హత
ప్రపంచ షూటింగ్ లో భారత షూటర్లు సంచలనం సృష్టించారు. మొత్తం 14 మంది భారత షూటర్లు వివిధ విభాగాల ఫైనల్స్ కు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.
చైనాలోని పుతియాన్ వేదికగా నవంబర్ 17 నుంచి 23 వరకూ జరిగే 2019 ప్రపంచకప్ షూటింగ్ మెడల్ రౌండ్లో పోటీపడనున్నారు.
రెండు విభాగాల ఫైనల్స్ లో మను బాకర్..
అంజుమ్ ముద్గల్ మహిళల ఏర్ రైఫిల్ 10 మీటర్లు, 50 మీటర్ల విభాగాల ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. మను బాకర్ మాత్రం 10మీటర్లు, 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాలలో పోటీపడనుంది.
భారత షూటింగ్ చరిత్రలో 14 మంది షూటర్లు ప్రపంచ కప్ పైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. మొత్తం 35 దేశాలకు చెందిన షూటర్లు ఎనిమిది విభాగాలలో పిస్టల్, రైఫిల్ విభాగాల ఫైనల్స్ లో తలపడనున్నారు.
రియో వేదికగా ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ లో భారత షూటర్లు మొత్తం 5 స్వర్ణాలతో సహా తొమ్మిది పతకాలు సాధించారు.
2019 సీజన్లో జరిగిన వివిధ ప్రపంచకప్ టో్ర్నీలలో భారత షూటర్లు 16 బంగారుపతకాలతో సహా 22 పతకాలు సాధించి సరికొత్తరికార్డు నమోదు చేశారు.