గోదావరి-కృష్ణా అనుసంధానానికి తగు ఒప్పందాలుంటాయి.. బాబులాంటి సన్నాసులు ఈ విషయం గుర్తించాలి...

గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి తీరుతామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నదులు అనుసంధానాల ద్వారా అద్బుతాలు చేసి చూపిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలిద్దామని ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. మంచి నిర్ణయం కాబట్టి తమ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. అది సాధ్యమైతే అద్భుతాలను తెలుగు రాష్ట్రాలు చూస్తాయన్నారు. పలు జిల్లాలు సశ్యశ్యామలం అవుతాయన్నారు. గోదావరి- కృష్ణా అనుసంధానం చేస్తే ఎగువ రాష్ట్రాల వైపు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ ప్రయత్నానికి […]

Advertisement
Update:2019-08-30 02:15 IST

గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి తీరుతామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నదులు అనుసంధానాల ద్వారా అద్బుతాలు చేసి చూపిస్తామన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలిద్దామని ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. మంచి నిర్ణయం కాబట్టి తమ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. అది సాధ్యమైతే అద్భుతాలను తెలుగు రాష్ట్రాలు చూస్తాయన్నారు. పలు జిల్లాలు సశ్యశ్యామలం అవుతాయన్నారు.

గోదావరి- కృష్ణా అనుసంధానం చేస్తే ఎగువ రాష్ట్రాల వైపు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ ప్రయత్నానికి అడ్డుపడేందుకు చంద్రబాబునాయుడు నీచ బుద్దితో ఆలోచన చేస్తున్నారన్నారు.

చంద్రబాబుది నీచబుద్ది, అల్ప బుద్ది కాబట్టి అందరికీ కూడా అదే బుద్ది ఉంటుందని భావిస్తుంటారని కేసీఆర్ విమర్శించారు. ఇప్పటికే ఇద్దరం ముఖ్యమంత్రులం ఒక ఆలోచనకు వచ్చామని… త్వరలోనే చర్చలు తుది దశకు వస్తాయన్నారు.

చంద్రబాబు ఎప్పుడూ కూడా ప్రాజెక్టులు కడుతుంటే అక్కడ మంచి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడన్నారు. గతంలో బాబ్లీపైనే ఇదే తరహాలో గొడవ చేసి మహారాష్ట్రతో సంబంధాలను దెబ్బతీశారన్నారు. తాము సరైన పద్దతితో చర్చలు జరపడంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకోగలిగామన్నారు.

కొందరు సన్నాసులు తెలివి తక్కువగా గోదావరి- కృష్ణా అనుసంధానంపై మాట్లాడుతున్నారని… ప్రాజెక్టు నిర్మాణానికి ముందే రెండు రాష్ట్రాల మధ్య తగురీతిలో ఒప్పందాలు, సంతకాలు చేసుకోవడం ఉంటుందన్నారు. కాబట్టి ఈ విషయంలో అనుమానాలకు తావుండదన్నారు కేసీఆర్. ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయని.. తదుపరి భేటీలో చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు కేసీఆర్‌.

Tags:    
Advertisement

Similar News