ఆర్టీసీలో చంద్రబాబు ప్రచార దుమారం

తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంపై సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ అభిమానులు ఓ రేంజ్‌లో వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్న వారిని పరిస్థితి ఎదురు తన్నింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి సంబంధమే లేదని తేలిపోయింది. ఈ ఘనకార్యం కూడా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ప్రకటనల్లో గత […]

Advertisement
Update:2019-08-23 11:46 IST

తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంపై సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ అభిమానులు ఓ రేంజ్‌లో వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్న వారిని పరిస్థితి ఎదురు తన్నింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి సంబంధమే లేదని తేలిపోయింది. ఈ ఘనకార్యం కూడా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది.

తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ప్రకటనల్లో గత నాలుగున్నరేళ్లలో ముస్లింలకు, క్రిస్టియన్లకు ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ వాటిని అచ్చేశారు. టిన్ మిషన్ ద్వారా జారీ చేసే ఈ టికెట్ల వెనుక భాగంలో ప్రకటనలు ముద్రించారు. ఆ పేపర్‌ రోల్స్‌ను ఇప్పుడు వాడడంతో … ఆ ప్రకటనను ఈ ప్రభుత్వంలోనే ముద్రించారని భావించారు. కానీ అవి టికెట్ రోల్‌పై ప్రకటనలు ముద్రించింది చంద్రబాబు హయాంలోనే.

అందుకే గత నాలుగున్నరేళ్లలో తాను ముస్లింలకు, క్రిస్టియన్లకు అవి చేశాం, ఇవీ చేశామని చంద్రబాబు ప్రభుత్వం ముద్రించింది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలోనే వాటిని ముద్రించి ఉంటే నాలుగున్నరేళ్లలో అని ఎందుకు చెబుతారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇంకా రెండు నెలలే కదా దాటింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2018లోనే దాదాపు 60వేల టిన్‌ పేపర్లపై ఈ తరహా ప్రకటనలు ముద్రించింది. ఈ అంశంపై ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో ఈ పొరపాటు జరిగిందని దాన్ని సరిచేస్తామని వెల్లడించింది. తిరుమల డిపోలో ఇలాంటి పేపర్లను వాడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News