జగన్ కు ఇల్లు లేదని ప్రచారం చేశారు.... కానీ టీడీపీ నాయకులు ఇది గుర్తించలేకపోయారు....
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని, ఈ రాజకీయాలతో లబ్ది పొందాలనుకుంటే అది వారి అపోహేనని పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు అభిప్రాయపడ్డారు. కృష్ణా కరకట్టను వరద నీరు ముంచెత్తడం, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నివాసాన్ని వరద నీరు చుట్టు ముట్టడం, డ్రోన్ లతో అక్కడి పరిస్థితిని ప్రభుత్వం సమీక్షించడం వంటి అంశాలపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా గోష్టిలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పార్థసారధి, కాంగ్రెస్ […]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బురద రాజకీయాలు చేస్తోందని, ఈ రాజకీయాలతో లబ్ది పొందాలనుకుంటే అది వారి అపోహేనని పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు అభిప్రాయపడ్డారు.
కృష్ణా కరకట్టను వరద నీరు ముంచెత్తడం, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నివాసాన్ని వరద నీరు చుట్టు ముట్టడం, డ్రోన్ లతో అక్కడి పరిస్థితిని ప్రభుత్వం సమీక్షించడం వంటి అంశాలపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా గోష్టిలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పార్థసారధి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మ, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.
ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ… వరదలపై ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
కరకట్టను వరద నీరు ముంచుతుందని తెలిసినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అక్కడే ఉండడం దారుణమని, ఆయన ఇల్లు మునిగిపోతోందని తెలిసిన తర్వాత హైదరాబాద్ పారిపోయారని పార్థసారధి విమర్శించారు.
వరదలు వచ్చినప్పుడు గతంలో ఎంతో అనుభవం ఉన్న తమ ముఖ్యమంత్రి ఎంతో చేశారని చెబుతున్న తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచలు చేయకుండా నిందలు వేయడం ఎంతవరకూ సమంజసమన్నారు.
“ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సాయం చేయకుండా…. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సాయం చేయమంటారా” అని ఎమ్మెల్యే పార్థసారథి ప్రశ్నించారు.
ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సుందర రామశర్మ మాట్లాడుతూ…. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇల్లే లేదని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు… ఇప్పుడు తమ నాయకుడు ఇన్నాళ్లూ ఎలాంటి ఇంట్లో ఉన్నారనే విషయం తెలుసుకోవాలని అన్నారు.
” వైఎస్ జగన్ ఎక్కువగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే ఉండేవారని విమర్శించే వారు. అమరావతిలో ఆయనకు ఇల్లే లేదు అనేవారు. ఇప్పుడు ఎవరు హైదరాబాద్ వెళ్లిపోయారో… ఎవరికి రాజధానిలో ఇల్లు లేదో ప్రజలకు తెలుస్తోంది” అని సుందరరామశర్మ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించాలని, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సుందర రామశర్మ డిమాండ్ చేశారు.
చర్చలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రం కష్టాల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ వరద రాజకీయాలకు పాల్పడడం దారుణమని అన్నారు. వరద బాదితులను ఆదుకోవడంలో కాని, వారికి సహాయ సహకారాలు అందజేయడంలో కాని ప్రభుత్వం చాలా బాగా పని చేసిందని, వరద బాదితులను ఆదుకోవడంలో మంత్రులు, అధికారులు చాలా చాకచక్యంగా పని చేసారని కితాబునిచ్చారు.