2022 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళా క్రికెట్

1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ కు చోటు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం 8 జట్ల పోటీ మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి ఐసీసీ నడుం బిగించింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యతో చేతులు కలిపింది. బర్మింగ్ హామ్ వేదికగా 2022 లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రధాన క్రీడాంశాలలో మహిళా క్రికెట్ కు సైతం చోటు కల్పిస్తున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. 1998 గేమ్స్ లో పురుషుల క్రికెట్… ఇంగ్లండ్ లో పుట్టి…బ్రిటీష్ […]

Advertisement
Update:2019-08-14 06:10 IST
  • 1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ కు చోటు
  • స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం 8 జట్ల పోటీ

మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి ఐసీసీ నడుం బిగించింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యతో చేతులు కలిపింది. బర్మింగ్ హామ్ వేదికగా 2022 లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రధాన క్రీడాంశాలలో మహిళా క్రికెట్ కు సైతం చోటు కల్పిస్తున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

1998 గేమ్స్ లో పురుషుల క్రికెట్…

ఇంగ్లండ్ లో పుట్టి…బ్రిటీష్ పాలిత కామన్వెల్త్ దేశాలకు విస్తరించిన క్రీడ క్రికెట్ కు కామన్వెల్త్ గేమ్స్ క్రీడాంశాలలో తొలిసారిగా 1998లో చోటు దక్కింది.

మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్ గేమ్స్ క్రీడాంశాలలో ఓ అంశంగా క్రికెట్ కు తొలిసారిగా చోటు కల్పించారు.

సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో నిర్వహించిన ఈ టోర్నీలో సౌతాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ జట్లు మొదటి మూడు స్థానాలలో నిలిచాయి.

సఫారీటీమ్ బంగారు పతకాలు అందుకొంటే…కంగారూ టీమ్ రజత, కివీస్ టీమ్ కాంస్య పతకాలతో సరిపెట్టుకొన్నాయి.
ఆ తర్వాత రెండుదశాబ్దాల విరామం తర్వాత మరోసారి క్రికెట్ కు కామన్వెల్త్ గేమ్స్ లో మరోసారి చోటు దక్కింది.

2022 గేమ్స్ లో మహిళా క్రికెట్ కు చోటు…

బర్మింగ్ హామ్ వేదికగా 2022లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో మహిళా క్రికెట్ కు తొలిసారిగా చోటు కల్పించారు. మహిళా క్రికెట్ కు విశ్వవ్యాప్తంగా ఆదరణ పెంచడం కోసం ఐసీసీ చోరవ తీసుకొని..కామన్వెల్త్ గేమ్స్ లో పతకం అంశంగా చేర్చడంలో సఫలమయ్యింది.

ఐసీసీ విజ్ఞప్తిని మన్నించి.. గేమ్స్ లో చోటు కల్పించినట్లు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ప్రకటించింది. అయితే…మ్యాచ్ ల నిర్వహణ బాధ్యత మాత్రం ఐసీసీదేనని తేల్చి చెప్పింది.

8 జట్లు…. 8 మ్యాచ్ లు….

2022 జులై 27 నుంచి ఆగస్టు 7 వరకూ జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ..ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఎనిమిదిరోజులపాటు ఎనిమిదిజట్లతో సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో టోర్నీ నిర్వహిస్తారు.

మొదటి మూడు స్థానాలలో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు బహుకరిస్తారు. ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాల జట్లు తలపడనున్నాయి.

టీ-20 ఫార్మాట్లో కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News