రెండోవన్డేలో భారత్ విజయం

క్వీన్స్ పార్క్ లో విరాట్ కొహ్లీ షో వానదెబ్బతో డక్ వర్త్ లూయిస్ ఫలితం విండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో భారత్ తొలివిజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. సూపర్ సెంచరీతో భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గయానా […]

Advertisement
Update:2019-08-12 02:30 IST
  • క్వీన్స్ పార్క్ లో విరాట్ కొహ్లీ షో
  • వానదెబ్బతో డక్ వర్త్ లూయిస్ ఫలితం

విండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో భారత్ తొలివిజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. సూపర్ సెంచరీతో భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

గయానా వేదికగా జరిగిన తొలివన్డే వానదెబ్బతో రద్దు కావడంతో… ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా జరిగిన కీలక రెండోవన్డేలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 2 పరుగుల స్కోరుకే అవుటైనా…రెండో వికెట్ కు రోహత్- కొహ్లీ జోడీ 74 పరుగుల భాగస్వామ్యంతో భారీస్కోరుకు పునాది వేశారు.

రోహిత్ 18 పరుగులకు అవుట్ కాగా.. యువఆటగాడు పంత్ 20, జాదవ్ 16,జడేజా 16 నాటౌట్ స్కోర్లు నమోదు చేశారు. శ్రేయస్ అయ్యర్ 68 బాల్స్ లో 5 బౌండ్రీలు, 1 సిక్సర్ తో 71 పరుగులు సాధించాడు.

కెప్టెన్ కొహ్లీ 125 బాల్స్ లో 14 బౌండ్రీలు, ఓసిక్సర్ తో 120 పరుగుల స్కోరుకు బ్రాత్ వెయిట్ బౌలింగ్ లో అవుటయ్యాడు. చివరకు భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగుల భారీ స్కోరు సాధించింది.

విండీస్ కు భువీ చెక్..

280 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ కు ఓపెనర్లు గేల్- లూయిస్ ఆచితూచి ఆడి మొదటి వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

గేల్ 11 పరుగులకు అవుట్ కాగా…లూయిస్ 80 బాల్స్ లో 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఆట మధ్యలో వర్షంతో అంతరాయం కలగడంతో.. విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులుగా నిర్ణయించారు.

అయితే…కరీబియన్ టీమ్ మాత్రం…భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్ లో గల్లంతయ్యింది. చివరకు 42 ఓవర్లలో 210 పరుగులకే కుప్పకూలింది.

భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు, ఖలీల్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

రత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి వన్డే క్వీన్స్ పార్క్ వేదికగానే.. ఆగస్టు 14న జరుగుతుంది.

Tags:    
Advertisement

Similar News