భారత క్రికెటర్లకూ ఇక డోప్ టెస్ట్ లు

నాడా పరిథిలో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ ఎట్టకేలకు దిగివచ్చింది. భారత ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న మిగిలిన క్రీడా సమాఖ్యల మాదిరిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం..నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్వహించే డోప్ పరీక్షల్లో విధిగా పాల్గొనటానికి ఆమోదం తెలిపింది. దేశంలోని వివిధ క్రీడాసంఘాలకు చెందిన క్రీడాకారులకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కమ్ నాడా సంస్థ అధికారికంగా డోప్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే…బీసీసీఐ మాత్రమే ఇంత కాలమూ నాడా […]

Advertisement
Update:2019-08-10 04:45 IST
  • నాడా పరిథిలో బీసీసీఐ

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ ఎట్టకేలకు దిగివచ్చింది. భారత ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న మిగిలిన క్రీడా సమాఖ్యల మాదిరిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం..నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్వహించే డోప్ పరీక్షల్లో విధిగా పాల్గొనటానికి ఆమోదం తెలిపింది.

దేశంలోని వివిధ క్రీడాసంఘాలకు చెందిన క్రీడాకారులకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కమ్ నాడా సంస్థ అధికారికంగా డోప్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే…బీసీసీఐ మాత్రమే ఇంత కాలమూ నాడా పరీక్షలను నిరాకరిస్తూ వచ్చింది.

బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..

భారత గడ్డపైన ఉన్న క్రీడా సంఘాలన్నింటీకి నిబంధనలు, నియమాలు ఒకటేనని… స్వతంత్ర ప్రతిపత్తికలిగిన బీసీసీఐ దానికి మినహాయింపు ఏమాత్రం కాదని కేంద్రక్రీడాశాఖ కార్యదర్శి రాధేశ్యామ్ జుల్హనియా తేల్చి చెప్పారు.

మరోవైపు… బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ మాత్రం… కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆదేశాలను పాటించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. భారత క్రికెటర్లందరికీ ఇక నాడా సంస్థ డోప్ పరీక్షలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

ఏడాదిలో ఎప్పుడైనా డోప్ పరీక్షలు..

భారత క్రికెటర్లకు ఏడాదికాలంలో ఎప్పుడైనా డోప్ పరీక్షలు నిర్వహించే అధికారం నాడాకు ఉంటుంది. భారత క్రికెట్ పురుషులు, మహిళల జట్ల సభ్యులందరికీ జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించనుంది.

బీసీసీఐ సందేహాలు….

నాడా నిర్వహించే డోప్ పరీక్షల పట్ల బీసీసీఐ పలు రకాల సందేహాలు వ్యక్తం చేసింది. డోప్ పరీక్షల కోసం ఉపయోగించే కిట్ బ్యాగుల నాణ్యత, పాథాలజిస్టుల సామర్థ్యం, శాంపిల్ ల సేకరణ అంశాలపై బీసీసీఐ సందేహాలను క్రీడాశాఖ కార్యదర్శి నివృత్తి చేశారు.

దేశంలోని మిగిలిన క్రీడాసంఘాలన్నీ ప్రభుత్వం సమకూర్చే ఆర్థిక సాయంతో మనుగడ సాగిస్తుంటే…బీసీసీఐ మాత్రం..ప్రభుత్వం నుంచి.. కనీసం ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా స్వతంత్రంగానే తన అస్థిత్వాన్ని కాపాడుకొంటూ వస్తోంది. ఈ కారణంగానే ఇంతకాలమూ నాడా పరీక్షలను నిరాకరిస్తూ వచ్చింది.

Tags:    
Advertisement

Similar News