ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా... డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా.. పెట్టుబడులే ధ్యేయంగా.. శుక్రవారం నాడు విజయవాడలోని గేట్ వే హొటల్ లో వివిధ దేశాల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అమెరికా, జపాన్, కెనడా, టర్కి, సింగపూర్, ఆస్ట్ర్రియా, ఆస్ట్ర్రేలియా వంటి దేశాలతో సహా 35 దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, కాన్సెలేట్ సభ్యులు, ఆయా దేశాల రాయబారులు సమావేశం కానున్నారు. రాష్ట్ర్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపడుతున్న […]

Advertisement
Update:2019-08-09 03:58 IST

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా.. పెట్టుబడులే ధ్యేయంగా.. శుక్రవారం నాడు విజయవాడలోని గేట్ వే హొటల్ లో వివిధ దేశాల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.

ఈ సమావేశంలో అమెరికా, జపాన్, కెనడా, టర్కి, సింగపూర్, ఆస్ట్ర్రియా, ఆస్ట్ర్రేలియా వంటి దేశాలతో సహా 35 దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, కాన్సెలేట్ సభ్యులు, ఆయా దేశాల రాయబారులు సమావేశం కానున్నారు.

రాష్ట్ర్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఈ సమావేశంలో విదేశీ ప్రతినిధులకు వివరిస్తారు.

ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సులో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారి హరీష్ రెడ్డి విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతారు.

రాష్ట్ర్రంలో పారదర్శక, అవినీతి రహిత పాలనపై విదేశీ ప్రతినిధులకు హరీష్ వివరణాత్మక సందేశాన్ని ఇస్తారు. అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర్రంలో చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెట్టుబడులకు ఏ రంగాలలో అనువైన అంశాలున్నాయో వివరిస్తారు.

రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించడంతో పాటు అవినీతి, పారదర్శకతల విశిష్టతను విదేశీ ప్రతినిధులకు వివరిస్తారు.

ఇక రాష్ట్ర్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర్రంలో పారిశ్రామిక, పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అనువైన అంశాలను వివరిస్తారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం రాష్ట్ర్రంలో ప్రగతే ధ్యేయంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇందులో రాష్ట్ర్రం ప్రధానంగా చేపడుతున్న నవరత్నాల అమలు, దాని వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాలు వంటి అంశాలను వివరిస్తారు.

భోజన విరామం తర్వాత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వివిధ దేశాలకు చెందిన రాయబారులతో సమావేశమవుతారు. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కావడం ఇదే తొలిసారి.

Tags:    
Advertisement

Similar News