ఉద్యోగం లేక వెనక్కు... 28 కోట్ల లాటరీ

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని అదృష్టం వరించింది. 28.4 కోట్ల లాటరీ తగిలింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో వెనక్కు వచ్చేశాడు. అయితే విలాస్‌కు తొలి నుంచి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. దుబాయ్‌లో ఉన్నప్పుడు కూడా కొన్ని టికెట్లు కొన్నాడు… కానీ అదృష్టం వరించలేదు. స్వస్థలానికి తిరిగి వచ్చిన విలాస్‌ భార్య వద్ద […]

Advertisement
Update:2019-08-04 05:20 IST

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని అదృష్టం వరించింది. 28.4 కోట్ల లాటరీ తగిలింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో వెనక్కు వచ్చేశాడు.

అయితే విలాస్‌కు తొలి నుంచి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. దుబాయ్‌లో ఉన్నప్పుడు కూడా కొన్ని టికెట్లు కొన్నాడు… కానీ అదృష్టం వరించలేదు. స్వస్థలానికి తిరిగి వచ్చిన విలాస్‌ భార్య వద్ద 20వేలు తీసుకుని దుబాయ్‌లో ఉన్న స్నేహితుడికి పంపించాడు. వాటి సాయంతో లాటరీ టికెట్లు కొనాల్సిందిగా కోరారు. మూడు టికెట్లు కొనుగోలు చేయగా అందులో ఒకటి విలాస్ పంట పండేలా చేసింది.

విలాస్ స్నేహితుడు కొనుగోలు చేసిన టికెట్లలో ఒకదానికి 28.4 కోట్ల రూపాయలు తగిలింది. ఈ విషయాన్ని స్నేహితుడు ఫోన్ చేసి చెప్పడంతో విలాస్ కుటుంబంలో ఆనందానికి అవదుల్లేవు. విలాస్‌కు భారీగా లాటరీ తగలడంపై గల్ఫ్‌ న్యూస్ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది.

Tags:    
Advertisement

Similar News