కొత్త ప్రభుత్వంలోనూ డోన్ట్ కేర్ అంటున్న ప్రైవేట్ స్కూళ్లు

ప్రైవేట్‌ స్కూళ్ల సంగతి తేలుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అసెంబ్లీలో గట్టిగా చెప్పారే గానీ… క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లు ఏమాత్రం పాటించడం లేదు. ఇలాంటి ప్రభుత్వాలను, కొత్త చట్టాలను ఎన్ని చూడలేదు?… అంటున్నట్టుగానే ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి ఉంది. ప్రైవేట్‌ స్కూళ్లు తప్పనిసరిగా ఫీజు వివరాలను స్కూల్‌ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించినా ఎక్కడా అది అమలు కావడం లేదు. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే అధికారులు గట్టిగా […]

Advertisement
Update:2019-08-03 03:33 IST

ప్రైవేట్‌ స్కూళ్ల సంగతి తేలుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అసెంబ్లీలో గట్టిగా చెప్పారే గానీ… క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లు ఏమాత్రం పాటించడం లేదు. ఇలాంటి ప్రభుత్వాలను, కొత్త చట్టాలను ఎన్ని చూడలేదు?… అంటున్నట్టుగానే ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి ఉంది.

ప్రైవేట్‌ స్కూళ్లు తప్పనిసరిగా ఫీజు వివరాలను స్కూల్‌ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించినా ఎక్కడా అది అమలు కావడం లేదు. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే అధికారులు గట్టిగా వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్‌ స్కూళ్లల్లో మార్పు కనిపిస్తోంది. మిగిలిన జిల్లాల్లో… మీది, మాది పాత బంధమే కదా అన్నట్టు అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు కూడా విద్యాశాఖ అధికారులను తమ మిత్రులుగా భావిస్తున్నారు.

కొత్త ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ల సంగతి తేలుస్తామని చెబుతున్నా… ప్రజల్లో, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు అవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చివరకు కొత్త బిల్లులు, చట్టాలకు సంబంధించిన వివరాలను కనీసం ఆన్‌లైన్‌లో కూడా ఉంచడం లేదు.

దీంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చెప్పిన దానికి చాలా మంది తల్లిదండ్రులు తలూపక తప్పడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు ఏ స్కూళ్లో ఎంత ఫీజు కట్టాలో ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రజలకు చట్టాన్ని పూర్తిగా వివరించకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ప్రభుత్వానికి, ప్రైవేట్ స్కూళ్లకు మధ్య అవగాహన తరహాలోనే ఉంటుంది కానీ…. దోపిడిని అడ్డుకునేందుకు అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు.

ఏపీ విద్యాశాఖ మంత్రి ప్రసంగాల్లో చూపిస్తున్న దూకుడు…. అసలు గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం చూపిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News