విదిశ బ‌లియాన్ 'మిస్ డెఫ్ వ‌ర‌ల్డ్ పాజెంట్ 2019'

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన ‘విదిశ‌ బ‌లియాన్’ ‘మిస్ డెఫ్ వ‌ర‌ల్డ్ పాజెంట్ 2019’ కిరీటాన్ని సొంతం చేసుకుని అరుదైన రికార్డును నెల‌కొల్పింది. ఈ కిరీటాన్ని అందుకున్న మొద‌టి ఇండియ‌న్ ఈమే. జులై 22న ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన ప్ర‌పంచ బ‌ధిరుల అందాల పోటీలో 16 దేశాల నుంచి సుంద‌రాంగులు పాల్గొన్నారు. వారిలో ఫైన‌ల్స్‌కి 11మంది చేరారు. వీరిలో మొద‌టి స్థానంలో నిలిచింది. బ‌లియాన్ 21 సంవ‌త్స‌రాలు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్పూర్‌ ఆమె స్వ‌స్థ‌లం అయినా ప్ర‌స్తుతం ఆమె కుటుంబం ఘ‌జియాబాదులో నివ‌సిస్తున్న‌ది. […]

Advertisement
Update:2019-07-25 16:00 IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన ‘విదిశ‌ బ‌లియాన్’ ‘మిస్ డెఫ్ వ‌ర‌ల్డ్ పాజెంట్ 2019’ కిరీటాన్ని సొంతం చేసుకుని అరుదైన రికార్డును నెల‌కొల్పింది. ఈ కిరీటాన్ని అందుకున్న మొద‌టి ఇండియ‌న్ ఈమే.

జులై 22న ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన ప్ర‌పంచ బ‌ధిరుల అందాల పోటీలో 16 దేశాల నుంచి సుంద‌రాంగులు పాల్గొన్నారు. వారిలో ఫైన‌ల్స్‌కి 11మంది చేరారు. వీరిలో మొద‌టి స్థానంలో నిలిచింది. బ‌లియాన్ 21 సంవ‌త్స‌రాలు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్పూర్‌ ఆమె స్వ‌స్థ‌లం అయినా ప్ర‌స్తుతం ఆమె కుటుంబం ఘ‌జియాబాదులో నివ‌సిస్తున్న‌ది.

బ‌లియాన్ మంచి టెన్నిస్ క్రీడాకారిణి. భార‌త దేశం త‌ర‌ఫున బ‌ధిరుల ఒలింపిక్స్‌లో పాల్గొని ర‌జ‌త ప‌త‌కం సాధించింది. టెన్నిస్ ఆడే ట‌ప్పుడు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో వెన్ను నొప్పి వ‌చ్చింది. దీంతో టెన్నిస్‌కి గుడ్ బై చెప్పి అందాల పోటీల‌కు సిద్ధ‌మ‌యింది.

గుర్‌గాం, నోయిడా వంటి న‌గ‌రాల్లో శిక్ష‌ణ తీసుకుని చివ‌రికి ప్ర‌ప‌పంచ బ‌ధిర సుంద‌రీమ‌ణి కిరీటాన్ని గెలుచుకున్న‌ది.

“ఆత్మ‌విశ్వాసాన్ని ప్రోదిచేసుకోవ‌డానికి, వ్య‌క్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవ‌డానికి ఈ అందాల పోటీలో పాల్గొన్నాను. ఈ వేదిక‌ను ఆధారం చేసుకుని బ‌ధిరుల్లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంపొందించ‌డానికి ప్రేర‌ణ ఇవ్వాల‌నుకున్నా. త‌మ‌లో లేని సామ‌ర్థ్యాల గురించి బాధ‌ప‌డ‌టం క‌న్నా ఉన్న సామ‌ర్థ్యాల‌ను మెరుగుప‌ర‌చుకుని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ని నా తోటి బ‌ధిరుల‌కు చెప్ప‌డానికి నేను ఈ అందాల పోటీలో పాల్గొన్నాను” అని ఆమె పేర్కొంది..
ఈ పోటీలో ర‌న్న‌ర‌ప్‌గా ద‌క్షిణాఫ్రికా సుంద‌రి నిలిచింది.

Tags:    
Advertisement

Similar News