మాది తప్పుడు ప్రచారమే ... క్షమించండి " టీవీ5

కొంత కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై టీవీ5 ఛానల్ పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తోందన్న భావన ఉంది. ఇందులో భాగంగా హిందువులను రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తోంది. ఒక అడుగు ముందుకేసి తిరుమల డీఇఓ గా క్రైస్తవుడు అయిన క్రిష్టో ఫర్ ను జగన్ నియమించారని ప్రచారం చేసింది టీవీ5. ఈ ప్రచారం పై టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బా రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీటీడీ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా తప్పుడు ప్రచారం […]

Advertisement
Update:2019-07-25 08:02 IST

కొంత కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై టీవీ5 ఛానల్ పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తోందన్న భావన ఉంది. ఇందులో భాగంగా హిందువులను రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తోంది. ఒక అడుగు ముందుకేసి తిరుమల డీఇఓ గా క్రైస్తవుడు అయిన క్రిష్టో ఫర్ ను జగన్ నియమించారని ప్రచారం చేసింది టీవీ5.

ఈ ప్రచారం పై టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బా రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీటీడీ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా తప్పుడు ప్రచారం చేసిన టీవీ 5 పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వెంటనే టీవీ5 స్పందించింది.

టీటీడీ పై తాము తప్పుడు వార్తను ప్రజలకు ఇచ్చింది నిజమేనని అంగీకరించింది. తాము ప్రసారం చేసిన వార్తలో నిజం లేదని ప్రకటించింది. కొందరు ఉద్యోగుల వల్ల ఈ తప్పు జరిగిందని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

Tags:    
Advertisement

Similar News