పవన్‌కు పరుచూరి గోపాలకృష్ణ సలహా

పరుచూరి గోపాలకృష్ణ. టాలీవుడ్ సీనియర్ రచయిత. ఆయన తన సోదరుడితో కలిసి అందించిన కథలెన్నో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ఆడపాదడపా మాత్రమే కథలను అందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు తమ వాణి వినిపించేందుకు యూట్యూబ్ చానెల్స్ పెట్టుకుంటున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ, నాగబాబు తరహాలోనే తన వాయిస్ కు వేదికగా తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఒక కొత్త యూట్యూబ్ చానెల్ ను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి […]

Advertisement
Update:2019-07-24 11:20 IST

పరుచూరి గోపాలకృష్ణ. టాలీవుడ్ సీనియర్ రచయిత. ఆయన తన సోదరుడితో కలిసి అందించిన కథలెన్నో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ఆడపాదడపా మాత్రమే కథలను అందిస్తున్నారు.

ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు తమ వాణి వినిపించేందుకు యూట్యూబ్ చానెల్స్ పెట్టుకుంటున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ, నాగబాబు తరహాలోనే తన వాయిస్ కు వేదికగా తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఒక కొత్త యూట్యూబ్ చానెల్ ను మొదలు పెట్టారు.

ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ చేసిన వ్యాఖ్యల పై పరిచూరి విశ్లేషించారు.

రీసెంట్ గా తానా సభల కోసం అమెరికా వెళ్లిన పవన్ చాలా విషయాలు మాట్లాడాడని.. ఎన్నికల ఫలితాలపై అతడిలో కించిత్ భయం కూడా లేదని పరుచూరి విశ్లేషించారు.

రాజకీయాల్లోకి వచ్చిన పవన్ సినిమాలు వదిలేయడం జనసేన కార్యకర్తలకు కూడా ఇష్టం లేదని పరిచూరి చెప్పుకొచ్చాడు.

సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయాలని అంతా కోరుకుంటున్న విషయాన్ని పవన్ మరిచిపోవద్దని సూచించారు. అన్న ఎన్టీఆర్ సైతం సినిమాలు చేసి రాజకీయాలను ప్రభావితం చేశారని.. ఈ విషయాన్ని పవన్ గుర్తుంచుకొని సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయాలని పవన్ కు సూచించారు.
తమిళనాట ఎంజీఆర్ కూడా ఇలానే చేశారని తెలుసుకోవాలన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినా పదేళ్లుగా ప్రతిపక్షంలో, ప్రజల్లో ఉండి సీఎం అయ్యారని.. ఇందుకోసం ఎంతో ఓపిగ్గా పోరాటం చేశారని.. పవన్ కూడా ఇలానే ప్రజల్లో ఉండాలని సలహా ఇచ్చారు గోపాలకృష్ణ.

Tags:    
Advertisement

Similar News