ప్రమాణస్వీకారం చేసిన గవర్నర్
ఏపీ నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఉండగా… ఆయన స్థానంలో ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌గా కేంద్రం విశ్వభూషణ్‌ను నియమించింది. ఒడిషాకు చెందిన విశ్వభూషణ్ 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు. 1980 […]
ఏపీ నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇప్పటి వరకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఉండగా… ఆయన స్థానంలో ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌గా కేంద్రం విశ్వభూషణ్‌ను నియమించింది. ఒడిషాకు చెందిన విశ్వభూషణ్ 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు.
1980 నుంచి 88 వరకు ఒడిషా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిషా న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు కవిగా, రచయితగా కూడా పేరుంది.