రేషన్ డీలర్లపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
రాష్ట్రంలో డీలర్ల వ్యవస్థను తొలగించే ఉద్దేశం, ప్రతిపాదన… ప్రభుత్వం వద్ద లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నిజమైన డీలర్లను తొలగించి టీడీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలకు రేషన్ షాపులు అప్పగించారని నాని ఆరోపించారు. గుడివాడలో 42 మంది రేషన్ డీలర్లు ఉంటే… టీడీపీ అధికారంలోకి రాగానే 42 మందిపైనా తప్పుడు కేసులు పెట్టి వారిని తప్పించారన్నారు. వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను రేషన్ డీలర్లుగా నియమించారని అసెంబ్లీలో మంత్రి వివరించారు. […]
రాష్ట్రంలో డీలర్ల వ్యవస్థను తొలగించే ఉద్దేశం, ప్రతిపాదన… ప్రభుత్వం వద్ద లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నిజమైన డీలర్లను తొలగించి టీడీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలకు రేషన్ షాపులు అప్పగించారని నాని ఆరోపించారు.
గుడివాడలో 42 మంది రేషన్ డీలర్లు ఉంటే… టీడీపీ అధికారంలోకి రాగానే 42 మందిపైనా తప్పుడు కేసులు పెట్టి వారిని తప్పించారన్నారు. వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను రేషన్ డీలర్లుగా నియమించారని అసెంబ్లీలో మంత్రి వివరించారు.
రాష్ట్రంలో మొత్తం 30వేల మంది రేషన్ డీలర్లు ఉండగా… టీడీపీ హయాంలో 10వేల మంది అసలైన డీలర్లను తప్పించి టీడీపీ కార్యకర్తలను నియమించారని మంత్రి చెప్పారు. డీలర్లను తొలగించే ఉద్దేశం తమకు లేదని… కాకపోతే టీడీపీ హయాంలో అడ్డదారుల్లో డీలర్ షిప్ దక్కించుకున్న వారి పై మాత్రం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
నిజమైన డీలర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రకటించారు. డీలర్లను ఇకపై స్టాకిస్టులుగా వాడుకుంటామని… వారి దగ్గర నుంచి వాలంటీర్లు సరుకులు తీసుకెళ్లి డోర్ డెలవరీ చేస్తారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డీలర్లపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని కొడాలి నాని హామీ ఇచ్చారు.
కొందరు డీలర్ల వద్ద దొంగ రేషన్ కార్డులు కూడా ఉన్నాయని… వాటిని స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించాలని… అలా చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తామని చెప్పారు.